దేశవ్యాప్తంగా కరోనా సేకండ్ విజృంభణ కొనసాగుతుంది. తెలంగాణలో కూడా రోజువారి కేసులు భారీగానే నమోదవుతున్నాయి. చాలా మంది శ్వాస సంబంధిత ఇబ్బందుల కారణంగానే మరణిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. కరోనా బాధపడుతూ.. తనకు తనకు ఊపిరి ఆడటం లేదని.. తనని ఎవరు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ కోవిడ్ వార్డు ముందు బైఠాయించి ఆందోళన చేసిన మహిళా నేడు చికిత్స పొందుతూ మృతి చెందింది. వివరాలు.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం బాదన్ కుర్తి గ్రామానికి చెందిన కందుల శాంత కు కోవిడ్ పాజిటివ్ రావడంతో నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని కోవిడ్ వార్డులో చేర్పించారు.
అయితే తనకు శ్వాస అందటంలేదని వేడుకుంటూ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టింది. తనను వేరే చోటికి తరలించాలని, అవసరమైతే తన మెడలోని తాళి తీసుకొమ్మంటు వేడుకుంది. తనకేమైన అయితే పిల్లలు దిక్కులేని వారవుతారంటూ ప్రాధేయపడింది. చివరకు ఆమె ను ఆదిలాబాద్ లోని రిమ్స్ కు తరలించారు. ఇక్కడ చికిత్స పొందుతూ ఈ రోజు ఆ మహిళ మృతి చెందింది. కాగా వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు.
ఇక, తెలంగాణలో కొత్తగా 6,551 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,01,783కి చేరింది. కొత్తగా 3,804 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 3,34,144కి చేరింది. రికవరీ రేటు 83.16 శాతం ఉంది. రాష్ట్రంలో కొత్తగా 43 మంది మరణించారు. మొత్తం మరణాలు 2042కి చేరాయి. మరణాల రేటు 0.50 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 65,597 యాక్టివ్ కేసులున్నాయి.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.