TELANGANA CONGRESS PRESIDENT REVANTH REDDY FIRES ON BJP AND TRS VRY HYD
Revanth Reddy : అమిత్ షా కనుసన్నల్లో టీఆర్ఎస్ రాజకీయం.. త్వరలో బయటపెడతా...
Revanth reddy
Revanth Reddy : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలులో వీధి నాటకాలకు తెర తీశారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రైతులను నట్టెట ముంచుతున్నారని ఆయన విమర్శించారు.
ధాన్యం కొనుగొలులో ( Paddy isssue ) కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై తెలంగాణ ( Telangana ) కాంగ్రేస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ( Revanth reddy ) ఫైర్ అయ్యారు. రెండు ప్రభుత్వాలు రైతుల పేరుతో రాజకీయం చేస్తున్నాయని దుయ్యబట్టారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు అంశాన్ని పక్కన పెట్టి ఎప్పుడో వేసే రబీ సీజన్ కోసం కేంద్రంపై ఒత్తిడి తేవడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రస్తుతం రైతులు ధాన్యం కొనుగోళ్లు లేక రోడ్లపై అవస్థలు పడుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు.అయినా టీఆర్ఎస్ ప్రభుత్వం ( TRS ) రాష్ట్రంలో కాదని ఢిల్లీలో రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయ డ్రామాకు తెరలేపిందని ఆరోపించారు. తాజాగా సీఎం కేసిఆర్ ( cm kcr )వ్యుహాలను పక్కన పెట్టి సునిల్ అనే రాజకీయ వ్యుహకర్త సూచనలతో టీఆర్ఎస్ ఢిల్లీ రాజకీయాలు ( Delhi politics ) చేస్తుందని ఆరోపించారు. కాగా సునిల్ అనే వ్యక్తి కేంద్రమంత్రి అమిత్ షాకు చాలా దగ్గరి మిత్రుడని ఆయన గురించి వివరాలు త్వరలో వెల్లడిస్తానని చెప్పారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిలు కేవలం మాటలకే పరిమితం అవుతున్నారని ఆయన విమర్శించారు.
మరోవైపు ఆపార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ( Uttamkumar reddy ) మాట్లాడుతూ...తెలంగాణ ప్రభుత్వం 3 వేల కోట్ల రూపాయలు ఇంటెన్సివ్ గా ప్రకటిస్తే, ఉత్పత్తి అయిన మొత్తం ధాన్యం ఎగుమతి చేయవచ్చని సూచించారు. అయినా ప్రభుత్వం దానిపై చర్యలు తీసుకోకుండా రాజకీయాలకే పరిమితం అవుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ఇక బీజేపి సైతం ఒకే సంవత్సరంలో పంటమార్పిడి చేయమని కోరడం కరెక్టు కాదని అన్నారు. లక్షల ఎకరాల్లో పంటల మార్పిడి చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.
తెలంగాణ లో టీఆర్ఎస్ ( TRS ) ప్రభుత్వంలో జరిగిన అవినీతి బాగోతం అందరికీ తెలుసని... అయినా కేంద్రప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు..
Gajwel : సీఎం కేసీఆర్ ఫాంహౌజ్‌లో ప్రమాదవశాత్తు వ్యవసాయ కూలి మృతి.. ఆదుకోవాలంటూ కుటుంబ సభ్యుల ఆందోళన
మరోవైపు టీఆర్ఎస్ ,బీజేపీల మధ్య ధాన్యం కొనుగోలు అంశంలో కోల్డ్ వార్ నడుస్తోంది. ఇరు ప్రభుత్వాలు ఎవరి పంథాలో వారు రాజకీయాలు చేస్తున్నారు. ఒక్కసారిగా ధాన్యం కొనుగోలు అంశంపై మాట మార్చిన కేంద్రం వైఖరిని తప్పుబడుతుంటే.. మరోవైపు బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయమని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుందని చెబుతున్నారు. అదే అంశంపై రాజకీయాలు చేస్తున్నారని ఏకంగా కేంద్ మంత్రులు విమర్శలకు దిగారు. మరోవైపు టీఆర్ఎస్ కు దీటుగా పోరాటాలు చేయాలని అమిత్ షా సైతం ఆ పార్టీ నేతలకు సూచించడంతో రాజకీయం మరింత ముదిరింది.
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.