Congress Dharna: పెట్రోల్ ధరలపై కాంగ్రెస్ నిరసనల్లో ఉద్రిక్తత...క్రిందపడిపోయిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి...!

Congress Dharna: పెట్రోల్ ధరలపై కాంగ్రెస్ నిరసనల్లో ఉద్రిక్తత...క్రిందపడిపోయిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి...!

Congress protest : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ...రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నిరసనలు వ్యక్తం చేశారు..హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో నాయకులు ధర్నా నిర్వహించారు..ధర్నాలో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని బలవంతంగా అరెస్ట్ చేయడంతో ఆయన క్రిందపడిపోయాడు.

  • Share this:
జాతీయ కాంగ్రెస్ ఆదేశాలతో పెంట్రోల్ ధరలకు పెరుగుదలకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది..హైదరాబాద్‌లోని తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యలతో పలువురు సీనియర్ నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు...

ధర్నా సంధర్బంగా పార్టీ నేతలు మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ హాయంలో పెట్రోల్ పై పన్నులు మొత్తం కలిపి రూ.9.34 ఉండేవని కాని ప్రస్తుత బీజేపి ప్రభుత్వంలో మాత్రం పన్నులు అమాంతం పెరిగి 36 రూపాయలు పన్నులుగా వేస్తున్నారని గుర్తు చేశారు.ఇక పన్నులు పెంచడం ద్వార రెండు లక్షల ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రజలపై భారం వేసిందని దుయ్యబట్టారు.

మరోవైపు పలు జిల్లాల్లో కూడా పార్టీ సీనియర్ నేతలు వివిధ పెట్రోల్ బంకుల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ధర్నాలో భాగంగా ఖమ్మంలో మల్లు భట్టివిక్రమార్క, కరీంనగర్‌లో శ్రీధర్‌బాబుతో పాటు జిల్లా నేతలు ఇక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఘట్‌కేసర్‌లోని వందన పెట్రోల్ బంకువద్ద కార్యకర్తలతో కలిసి ధర్నా నిర్వహించారు. కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భువనగిరిలో ప్రాంతాల్లో పాల్గోన్నారు..

అయితే జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అధ్వర్యంలో కొనసాగుతున్న నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది.జీవన్ రెడ్డి వెంట పెద్ద ఎత్తున కార్యకర్తలు నినాదాలు చేస్తూ నిరసన కొనసాగించారు..ఈ క్రమంలోనే ఇందిరాభవన్ నుండి కొత్త బస్టాండ్ వరకు ఆటోను తాడుతో గుంజుతూ నిరసన వ్యక్తం చేశారు.దీంతో పోలీసులు ర్యాలీని అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది...దీంతో పోలీసులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని అరెస్ట్ చేసే క్రమంలో ఆయన క్రింద పడిపోయాడు..అయినా పోలీసులు బలవంతగా ఆయనతో పాటు కార్యకర్తలను పోలీసు స్టేషన్‌కు తరలించారు.

మరోవైపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెట్రోల్ , డిజిల్ ధరల పెరుగుదలతో విన్నూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.. ఈనేపథ్యంలోనే పలు రాష్ట్రాల్లో ఎడ్లబండిపై కారును ఎక్కించి ప్రదర్శన నిర్వహించారు..రిక్షాలు తొక్కడంతో సైకల్ మోటారును నెట్టుకుంటూ తమ నిరసనను వ్యక్తం చేశారు...
Published by:yveerash yveerash
First published: