Revanth reddy : ఎమ్మెల్యే కొటాలో జరిగే ఎమ్మెల్సీ ప్రక్రియ రాజ్యంగ బద్దంగా జరగడం లేదని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కు పిర్యాదు చేసింది. ఎన్నికల ప్రక్రియ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టుకు కూడా వెళతామని ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
ఎమ్మెల్యే కొటాలో జరిగే ఎమ్మెల్సీ ప్రక్రియ రాజ్యంగ బద్దంగా జరగడం లేదని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కు పిర్యాదు చేసింది. ఎన్నికల ప్రక్రియ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టుకు కూడా వెళతామని ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే.. టీఆర్ఎస్ పార్టీ ఆరుగురు ఎమ్మెల్సీల పేర్లను సైతం ప్రకటించి నామినేషన్లను కూడా వేసింది. అయితే అయితే ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగే అవకాశాలు ఉన్నా.. ఎన్నికలు జరిగే ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల అధికారులు నిబంధలకు అనుగుణంగా నిర్వహించడం లేదని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా ఎన్నికల నామినేషన్ల తర్వాత అభ్యర్ధుల నామినేషన్ పత్రాలను ఆన్లైన్ వెబ్సైట్లో ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత వారిపై ఉందని, కాని ఆ నామినేషన్ల ప్రక్రియలో లొసుగులు ఉండడంతో వాటిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఇక ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన వెంకట్రామిరెడ్డి పత్రాలపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఐఏఎస్‌గా చేసిన రాజీనామాను కేంద్రం పరిధిలో ఉండే డీవోపీటి అమోదించిందా .. అని ఆయన ప్రశ్నించారు. కేంద్రం పరిధిలో ఉండే ఆయన రాజీనామాపై ఎలాంటీ సమాచారం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడంతో నామినేషన్ వేశారని అన్నారు. ఇక వెంకట్రామిరెడ్డిపై అనేక ఆరోపణలు ఉన్నాయని ఆయన అన్నారు. వీటిలో రెవెన్యు ఆరోపణలతో పాటు పలు వివాదాల్లో కూడా ఉన్నారని చెప్పారు. ఇక నామినేషన్ పత్రాలను పరిశీలించేందుకు వెళ్లిన ప్రజా ప్రతినిదులకు కూడా అవకాశం ఇవ్వలేదని అన్నారు. దీంతో తమకు మరింత అనుమానం పెరిగిందని చెప్పారు. కాగా నిన్న మూడు గంటలకు నామినేషన్ ముగిసిన వెంటనే అభ్యర్థుల నామినేషన్ పత్రాలను అప్లోడ్ చేయాలనే నిబంధన ఉన్నా అధికారులు ఇప్పటి వరకు వాటిని ఆన్లైన్లో పెట్టలేదని ఆయన అన్నారు.
ఈ క్రమంలోనే ఆయన నామినేషన్ ప్రక్రియ పత్రాలను ప్రజల ముందుకు పెట్టకపోతే నేరుగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆయన హెచ్చరించారు. ఇప్పటికైన అధికారులు నియమనిబంధనలు పాటించాలని ఆయన డిమాండ్ చేశారు.
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.