హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana Budget : బడ్జెట్ ప్రసంగాన్ని బహిష్కరించిన కాంగ్రేస్.. అసెంబ్లీ గేటు ముందు బీజేపీ ఎమ్మెల్యేల ధర్నా..! అరెస్ట్ ..

Telangana Budget : బడ్జెట్ ప్రసంగాన్ని బహిష్కరించిన కాంగ్రేస్.. అసెంబ్లీ గేటు ముందు బీజేపీ ఎమ్మెల్యేల ధర్నా..! అరెస్ట్ ..

Telangana Budget : తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కొనసాగుతున్న మంత్రి హరీష్ రావు ప్రసంగాన్ని తెలంగాణ కాంగ్రేస్ పార్టీ బహిష్కరించింది. మరోవైపు సెషన్ మొత్తనికి సస్పెండ్ అయిన బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ గేటు ముందు బైఠాయించారు.

    తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికి ఆయా పార్టీల తమ రాజకీయ వ్యుహాలకు పదును పెట్టాయి. గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలను ప్రారంభించిన ప్రభుత్వం వైఖరిపై బీజేపీ అప్పటికే నల్ల జెండాలు ధరించి అసెంబ్లీలోకి ప్రవేశించారు. అనంతరం సమావేశాలు ప్రారంభమైన వెంటనే మంత్రి హరీష్ రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలోనే బీజేపీ ఎమ్మెల్యేలు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో సభ ప్రారంభమైన పదిహేను నిమిషాలకే వారిని సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తూ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ప్రవేశపెట్టారు. దీంతో వెంటనే ఆ తీర్మాణానికి ఆమోదం తెలుపుతూ వెంటనే వారిని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి సస్పెండ్ చేస్తూ ప్రకటించారు. దీంతో వారిని బలవంతంగా మార్షల్స్ బయటకు పంపించారు. అనంతరం బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ గేటు ముందు బైఠాయించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులతో వాగ్వావాదానికి దిగారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి బోల్లారం పీఎస్‌కు తరలించారు.

    మరోవైపు  బడ్జెట్ సమావేశాల్లో నిబంధనలు పాటించకుండా రాజ్యాంగాన్ని ఉల్లంగిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్‌కు మైక్ ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.  స్పీకర్...  సభ్యుల సభా గౌరవాన్ని పాటించడం లేదని ఆరోపించారు. స్పీకర్ సభను ఏకపక్షంగా నడుపుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పించారు.  అంతకు ముందు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు అసెంబ్లీలోని తమ పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు .ప్రజా సమస్యలపై సభలో నిలదీయాల్సిన అంశాలపై చర్చించారు. ముఖ్యంగా నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూంతోపాటు వరి ధాన్యం కొనుగోలుతో పాటు రైతుల సమస్యలపై షార్ట్ డిస్కషన్ పెట్టాలనే యోచనలో ఉన్నారు. దీంతో ప్రభుత్వం అందుకు అనుమతి ఇవ్వకపోతే సభను బహిష్కరించాలనే నిర్ణయానికి వచ్చారు.. ముఖ్యంగా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నట్టుగా రైతులతో పాటు నిరుద్యోగ సమస్యలపై ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి తమ వ్యుహాలు ఉండనున్నట్టు పార్టీ నేతలు చెప్పారు. ఈక్రమంలోనే బడ్జెట్ సమావేశాలను బహిష్కరించినట్టు తెలుస్తోంది.

    First published:

    Tags: Harish Rao, Telangana Budget 2022

    ఉత్తమ కథలు