తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. పోలీస్ స్టేషన్‌లో ఉద్రిక్తత..

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబును పోలీసులు అరెస్ట్ చేశారు.

news18-telugu
Updated: July 26, 2020, 3:06 PM IST
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. పోలీస్ స్టేషన్‌లో ఉద్రిక్తత..
శ్రీధర్ బాబును అరెస్ట్ చేస్తున్న పోలీసులు
  • Share this:
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ రావు మండలం మల్లారం గ్రామంలో మృతి చెందిన దళిత వ్యక్తి రాజబాబు మృతికి నిరసనగా చలో మల్లారం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు బయలుదేరి వెళ్తుండగా ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాన్వాయ్ ని అడ్డుకుని వాహనాలకు అడ్డంగా పడుకున్నారు. వారిని పోలీసులు బలవంతంగా లాగి వేసి శ్రీధర్ బాబును, కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

మంంథని బ్రిడ్జి వద్ద అరెస్టు చేసిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను మంథని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఒకేసారి మంథని పోలీస్ స్టేషన్‌కు చేరుకోగా పోలీస్ స్టేషన్లు నినాదాలతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ముత్తారం పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 26, 2020, 2:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading