TELANGANA CONGRESS MLA KOMATIREDDY RAJAGOPAL REDDY PLAYING SAFE GAME IN POLITICS AK
Telangana: సైలెంట్‌గా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే.. సేమ్ గేమ్ ఆడుతున్నారా ?
ప్రతీకాత్మక చిత్రం
Telangana Politics: వ్యక్తిగతంగానూ బలమైన నాయకుడు కావడంతో.. రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా ఉప ఎన్నికలకు వెళితే టీఆర్ఎస్కు ఇబ్బందులు తప్పకపోవచ్చనే చర్చ కూడా సాగింది. కానీ ఇప్పటివరకు దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు.
కాంగ్రెస్‌లో ఎవరు ఎలాంటి కామెంట్స్ చేస్తారో ఊహించలేం. అందులోనూ తెలంగాణ కాంగ్రెస్‌లో ఉన్న నాయకుల్లో ఎంతమంది నేతలు ఆ పార్టీ పట్ల విధేయతతో ఉన్నారన్నది కచ్చితంగా చెప్పలేం. పేరుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ.. ఆ పార్టీలో ఎప్పుడు ఉంటారో.. ఎప్పుడు బయటకు వెళ్లిపోతారో చెప్పలేని పరిస్థితి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఆయన ఇదే రకంగా వ్యవహరిస్తున్నారు. మధ్యలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీనే అని బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఆ తరువాత తన వ్యాఖ్యలకు అర్థం అదికాదంటూ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉండకుండా దూరం దూరం పాటిస్తున్న రాజగోపాల్ రెడ్డి మనసంతా బీజేపీ చుట్టే తిరుగుతోందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే అప్పట్లో ఆయన కామెంట్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. బీజేపీ నాయకత్వం ఆయనను పార్టీలోకి తీసుకునే విషయంలో పునరాలోచనలో పడిందని ప్రచారం సాగింది.
అయితే అసలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణ ఏమిటన్నది దానిపై మాత్రం ఎవరికీ ఓ క్లారిటీ రావడం లేదు. నిజానికి ఈ ఏడాది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరతారని.. ఆయన రాజీనామా చేయడం ద్వారా తెలంగాణలో మరోసారి ఉప ఎన్నికలు వచ్చేలా బీజేపీ ప్లాన్ చేసిందని ఊహాగానాలు బలంగా వినిపించాయి. బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు ఊతమిచ్చాయి. బీజేపీ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ గెలుపు తరువాత మరో ఉప ఎన్నికకు బీజేపీ ప్లాన్ చేసిందని.. ఇందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూపంలో ఆ పార్టీకి సహకారం లభించబోతోందని పలువురు అభిప్రాయపడ్డారు.
ఇప్పటికే బీజేపీకి తెలంగాణ అసెంబ్లీలో ముగ్గురు ఆర్లు (రాజాసింగ్, రఘునందన్ రావు, రాజేందర్) ఉన్నారని.. త్వరలోనే మరో ఆర్ (రాజగోపాల్ రెడ్డి) కూడా వచ్చి చేరతారని నేతలు కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా బీజేపీకి ఈ విషయంలో సానుకూలంగా ఉన్నారమో అని రాజకీయవర్గాలు భావించాయి. వ్యక్తిగతంగానూ బలమైన నాయకుడు కావడంతో.. రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా ఉప ఎన్నికలకు వెళితే టీఆర్ఎస్కు ఇబ్బందులు తప్పకపోవచ్చనే చర్చ కూడా సాగింది. కానీ ఇప్పటివరకు దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు.
దీనికితోడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం ఈ విషయంలో మౌనంగానే ఉంటున్నారు. అయితే భవిష్యత్ రాజకీయాల విషయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యూహాత్మంగా వ్యవహరిస్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది. ఇప్పటికప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా.. అవసరాన్ని, సందర్భాన్ని పార్టీ కీలక నిర్ణయం తీసుకోవాలనే యోచనలో ఆయన ఉన్నారని సమాచారం. ప్రస్తుతానికి ఇటు కాంగ్రెస్‌లో సైలెంట్‌గా ఉంటూ.. అటు బీజేపీకి దగ్గరవుతున్నట్టు కనిపిస్తున్న రాజగోపాల్ రెడ్డి.. చివరకు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.