పీసీసీ అతడికి వద్దని చెబుతా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

నన్ను అడగకుండా రేవంత్‌కి పీసీసీ ఇస్తే .. నా రాజకీయం నాకు ఉంటుందని, నాకు కొత్త ఆలోచన ఉందన్నారు. రేవంత్ రెడ్డి మినహాయిస్తే.. ఎవరికీ పీసీసీ ఇచ్చినా అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.

news18-telugu
Updated: May 31, 2020, 3:58 PM IST
పీసీసీ అతడికి వద్దని చెబుతా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
జగ్గారెడ్డి (ఫైల్ ఫోటో)
  • Share this:
లాక్‌డౌన్ ముగింపుతో కాంగ్రెస్ పార్టీలో మళ్లీ రాజకీయాలు మొదలయ్యాయని, పీసీసీ మార్పుపైనా ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. అయితే ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్‌రెడ్డిని మార్చాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఈ విషయమై రాహుల్ గాంధీకి లేఖ రాస్తానని, వచ్చే ఎన్నికలను కూడా ఉత్తమ్ చేతుల మీదుగా నడిస్తేనే ఉత్తమమని పేర్కొన్నారు. పార్టీలో పీసీసీ పదవి కోసం 20 మంది సిద్ధంగా ఉన్నారని, నేనంటే నేనని పోటీపడుతున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి సైతం పీసీసీ అడుగుతున్నారని, అభిప్రాయాలు తీసుకోకుండా రేవంత్‌కి పీసీసీ ఇస్తే వ్యతిరేకిస్తామని, రేవంత్‌కు పీసీసీ ఇవ్వొద్దని చెప్పారు. నన్ను అడగకుండా రేవంత్‌కి పీసీసీ ఇస్తే .. నా రాజకీయం నాకు ఉంటుందని, నాకు కొత్త ఆలోచన ఉందన్నారు.

రేవంత్ రెడ్డి మినహాయిస్తే.. ఎవరికీ పీసీసీ ఇచ్చినా అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. నేను కూడా పీసీసీ రేసులో ఉన్నా.. ఉత్తమ్ పీసీసీగా ఫెయిల్ అయ్యారనేది అనవసర నింద అని, ఓటమికి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని నిందలు వేయడం తప్పని పేర్కొన్నారు. ఉత్తమ్.. తన భార్యను గెలిపించుకోలేకపోవడం వల్ల పీసీసీకి అన్ ఫిట్ అనేది రేవంత్ వర్గం చేసిన ప్రచారమని తెలిపారు. అందరిని గెలిపిస్తా అని తిరిగిన రేవంత్... ఆయనే ఓడిపోయాడు కదా. రేవంత్ సోషల్ మీడియా టీం దానికి ఏమంటారని ప్రశ్నించారు.

ఒక్క ప్రాజెక్టు కట్టిన కేసీఆర్ ఇంత హడావిడి చేస్తే.. ఎన్నో ప్రాజెక్టులు కట్టిన కాంగ్రెస్ ఏం చేప్పుకోవాలన్నారు. ఉత్తమ్ బలమైన నాయకుడని, ఆయనతో పాటు చాలామంది నాయకులు కూడా ఉన్నారని, గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేలు వారి సొంత వీక్ నెస్ వల్లే వెళ్లిపోయారని చెప్పారు. కాంగ్రెస్‌లో చాలామంది ప్రభుత్వ కోవర్డులు ఉన్నారని, పార్టీ ఇన్‌ఛార్జి కుంతియా చూట్టే కొంతమంది కోవర్టులు ఉన్నారని తెలిపారు. మా కూతురు జయారెడ్డికి రాజకీయాలు ఇష్టం లేదని, కానీ పరిస్థితిని బట్టి జయారెడ్డిని రాజకీయాల్లోకి తీసుకువస్తున్నానని చెప్పారు. ‘నాపై రాజకీయ కక్షసాధింపుకు దిగితే.. నా కూతురు రాజకీయాల్లో ఉంటది.. జగ్గారెడ్డి కంటే గట్టిగా కొట్లాడుతుంది నా బిడ్డ’ అంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
Published by: Narsimha Badhini
First published: May 31, 2020, 3:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading