Home /News /telangana /

TELANGANA CONGRESS MLA JAGGA REDDY RESIGNATION COMMENTS VIRAL VRY

Telangana Congress : కాంగ్రెస్ రచ్చ, జగ్గారెడ్డికి బుజ్జగింపులు.. ఐదు రోజుల కౌంట్‌డౌన్...

Telangana Congress : గత వారం రోజులుగా కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీలో చెలరేగిన రచ్చ చివరకు జగ్గారెడ్డి రాజీనామాకు దారికి తీశాయా..?  రేవంత్ రెడ్డి దూకుడుపై గుర్రుగా ఉన్నా జగ్గారెడ్డి యాక్షన్ ఎలా ఉండబోతుంది. ఆయన రాజీనామా చేస్తారా.. ?

ఇంకా చదవండి ...
    గత వారం రోజుల క్రితం పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎర్రవల్లిలో చేపట్టిన రచ్చబండ కార్యక్రమం ఆ పార్టీలో మరోసారి చిచ్చురేపింది. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న తనకు కనీసం సమాచారం ఇవ్వక పోవడం వెనక అంతర్యం ఏమిటని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఏకంగా పార్టీ హైకమాడ్‌కు లేఖ రాశారు..

    కాగా తాజాగా రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డిల మధ్య ఈ వైరం చివరకు జగ్గారెడ్డి రాజీనామా చేస్తానని చెప్పడంతో ఒక్కసారిగా ఆ పార్టీలో ఉలికిపాటు మొదలైంది. దీంతో రాజకీయా వ్వవహారాల కమిటీ భేటి అయి చర్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే జగ్గారెడ్డి వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తుండడంతో పార్టీ సీనియర్ నేతలు బుజ్జగింపులకు దిగారు.

    Bandi sanjay : వనమా రాఘవ, పోలీసు కుటుంబాలను కూడా వదల్లేదు. అయినా.. కేసీర్ సపోర్ట్..చేస్తాడా..?

    పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న వ్యక్తిని కాపాడుకునేందుకు పార్టీ సీనియర్లు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే పార్టీ ఇంచార్జ్‌తో పాటు సీనియర్ నేతలు గీతారెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మహెశ్వర్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్కలు ఆయన్ను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు.. జగ్గారెడ్డితో పార్టీ కార్యాలయంలో వారు మంతనాలు జరుపుతున్నారు. అయితే జగ్గారెడ్డి మాత్రం తన వైఖరిపై హైకమాండ్‌తో చర్చిస్తానని ,సోనియా గాంధీతో సమావేశానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇక తాను రాజీనామాపై చేసిన వ్యాఖ్యలపై కూడా స్పష్టత ఇస్తానని.. ఆయన స్వయంగా చెప్పారు. తాను రాజీనామా చేస్తానని చెప్పానా లేదా అనేది తర్వాత చెబుతానని మీడియాకు వివరించారు..

    Vanama Raghava : కొడుకు కాలకేయుడైతే.. తండ్రి దృతరాష్ట్రుడా..? గూడేం ప్రజల బెంబేలు.

    మొత్తం మీద గత కొన్ని నెలలుగా జగ్గారెడ్డి వైఖరి పార్టీలో ఇబ్బందికరంగా మారిందనే అభిప్రాయం కూడా పార్టీ నేతల్లో నెలకొన్నట్టు చెబుతున్నారు. అందుకే ఆయన్ను పక్కన పెట్టే కార్యక్రమాలకు రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారని చెబుతున్నారు. కాగా కొత్తగా ఎన్నికైన రేవంత్ రెడ్డి ఎలాంటీ సమాచారం లేకుండా ఆయన నియోజకవర్గానికి వెళ్లడం అనేది దుమారం రేగినా.. పార్టీ అధ్యక్షుడిగా ఎలాంటీ నిర్ణయమైనా తీసుకునే అధికారం రేవంత్ రెడ్డికి ఉంటుంది. అయినా ఆయన అధికారాన్ని జగ్గారెడ్డి సవాల్ చేశాడు.దీంతో ఇరువురి మధ్య వైరం మరింత ముదిరింది. ఈ పరిణామాలకు ఫుల్‌స్టాప్ పడుతుందా లేదా అని వేచి చూడాలి.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Jaggareddy, TS Congress

    తదుపరి వార్తలు