Telangana: ఇదేం పద్ధతి.. వారికి ప్రాధాన్యత ఇవ్వొద్దు.. తిట్టినా పట్టించకోరా ? వీహెచ్ ఆగ్రహం

వి.హనుమంతరావు(ఫైల్ ఫోటో)

Telangana: 2023 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకు పోవాలంటే గత ప్రతి ఎన్నికల వైఫల్యాలను గుర్తించి ముందుకెళ్లాలని వీహెచ్ అన్నారు.

  • Share this:
    తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న పరిస్థితులపై ఆ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అయోమయ పరిస్థితుల్లో ఉందని వ్యాఖ్యానించారు. అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాతనే టీ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, కొత్త కమిటీ అనేది ఎంపిక చేయాలని హైకమాండ్‌కు విజ్ఞప్తి చేశారు. కొంతమంది తనను తనను తిట్టినా, బెదిరింపులకు పాల్పడినా కూడా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై ఇప్పటికైనా పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ దృష్టి పెట్టాలని సూచించారు. పార్టీలో సీనియర్ల అభిప్రాయం లేకుండా కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వొద్దని వీహెచ్ కోరారు.

    రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందడానికి గల కారణాలపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టాలని అన్నారు. గత లోపాలను గుర్తించి, సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 2023 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకు పోవాలంటే గత ప్రతి ఎన్నికల వైఫల్యాలను గుర్తించి ముందుకెళ్లాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటేనే ఫలితాలు వస్తాయని.. లేకుంటే పరిస్థితులు మరింతగా దిగజారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి కారణంగానే దేశంలో 18 ఏళ్లు నిండిన వాళ్లందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్రం ముందుకొచ్చిందని వీహెచ్ అన్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published: