ఆంధ్రా కేడర్ ఐపీఎస్‌కు తెలంగాణాలో ఏం పని?: కాంగ్రెస్ నేత దాశోజు శ్రవణ్

హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అధికార టిఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ ధ్వజమెత్తారు.

news18-telugu
Updated: December 30, 2019, 11:01 PM IST
ఆంధ్రా కేడర్ ఐపీఎస్‌కు తెలంగాణాలో ఏం పని?: కాంగ్రెస్ నేత దాశోజు శ్రవణ్
మీడియాతో మాట్లాడుతున్న దాసోజు శ్రవణ్
  • Share this:
హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అధికార టిఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు తాబేదారుగా, తొత్తుగా వ్యవహరిస్తున్నారని జాతీయ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ ధ్వజమెత్తారు. గాంధీ భవన్ లో శ్రవణ్ మాట్లాడారు. ఆంధ్రా కేడర్ కు చెందిన ఈ ఐపీఎస్ అధికారికి తెలంగాణ రాష్ట్రంలో ఏం పని ఉందంటూ ఆయన ప్రశ్నించారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ఐఏఎస్ లు , ఐపీఎస్ అధికారులు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మారి పోయారని ఆరోపించారు. శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన సదరు సీపీ ఫక్తు అధికార నాయకుడిగా వ్యవహరిస్తూ పోలీస్ వ్యవస్థ తలొంచుకునేలా చేస్తున్నాడని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి, ఎంఐఎం పార్టీల అధినేతలు చెప్పినట్లు నడుచుకుంటూ ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండి పడ్డారు. సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఆర్ఎస్ఎస్ మార్చ్ కు, ఎంఐఎం పబ్లిక్ మీటింగ్ కు ఎలా పర్మిషన్ ఇచ్చారని శ్రవణ్ నిలదీశారు. వీరికి అనుమతి ఇచ్చిన సీపీ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అనుమతి రద్దు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ మాట్లాడిన తీరు పై స్పందించారు. నిబద్దతతో పని చేసిన ఐపీఎస్ లు ఉన్నారు. వారిని తమ పార్టీ ఏమీ అనడం లేదని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణాలో ఐపీఎస్ లు, ఐఏఎస్ లు ఎస్ బాస్ అంటూ ఉన్నారని ఆరోపించారు. మరోవైపు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తల తోక లేకుండా మాట్లాడుతున్నారని శ్రవణ్ అన్నారు. ఉత్తమ్ పై కామెంట్స్ చేసే స్థాయికి ఇంకా తలసాని ఎదగలేదన్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: December 30, 2019, 11:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading