సచివాలయ ముట్టడికి పిలుపునివ్వలేదు.. సీఎం కేసీఆర్‌పై భట్టి ఆగ్రహం

అసలు తాము సచివాలయ ముట్టడికే పిలుపునివ్వలేదని.. పలు సమస్యలపై సీఎంకు వినతీ పత్రం ఇవ్వాలని మాత్రమే భావించామని స్పష్టం చేశారు.

news18-telugu
Updated: June 11, 2020, 3:54 PM IST
సచివాలయ ముట్టడికి పిలుపునివ్వలేదు.. సీఎం కేసీఆర్‌పై భట్టి ఆగ్రహం
సీఎం కేసీఆర్, భట్టి విక్రమార్క
  • Share this:
గురువారం ఉదయం తెలంగాణ కాంగ్రెస్ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేసిన విషయం తెలిసిందే. సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చారనే సమచారంలో వారిని ఇళ్లకే పరిమితం చేశారు. వీహెచ్, శ్రీధర్ బాబును ముందుస్తు అరెస్ట్ చేయగా.. పీసీసీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి ఇళ్ల ముందు పోలీసులు భారీగా మోహరించారు. భట్టి విక్రమార్క ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించడంతో ఆయన్ను పోలీసులు అడ్డుకొని తిరిగి ఇంట్లోకి పంపించారు. ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అసలు తాము సచివాలయ ముట్టడికే పిలుపునివ్వలేదని.. పలు సమస్యలపై సీఎంకు వినతీ పత్రం ఇవ్వాలని మాత్రమే భావించామని స్పష్టం చేశారు.

తెలంగాలణలో దుర్మార్గమై పాలన సాగుతోంది. మేం సచివాలయ ముట్టడికి పిలుపునివ్వలేదు. కేవలం సీఎం కేసీఆర్‌ను కలిసి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించాం. కానీ పోలీసులు ఎంత చెప్పినా వినలేదు. తమను అర్ధం చేసుకోకుండా గృహ నిర్బంధం చేశారు. విద్యుత్‌ బిల్లులు, నియంత్రిత వ్యవసాయ విధానం, కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సీఎంతో చర్చించేందుకే అనుమతి కోరాం. వ్యవసాయశాఖ మంత్రి ఉదయం 10 గంటలకు ఆయన్ను కలిసేందుకు అవకాశం ఇచ్చారు. కానీ పోలీసులు తమను వెళ్లకుండా అడ్డుకున్నారు. సమాచార లోపంతో పోలీసులు ఇలా వ్యవహరించడం తగదు.
భట్టి విక్రమార్క


ఇంత అనాలోచిత పాలనను తాను ఎక్కడా చూడలేదని సీఎం కేసీఆర్‌పై భట్టి విక్రమార్క మండిపడ్డారు. ప్రజల పక్షాన ఏం మాట్లాడినా పాలకులు నిర్బంధం కొనసాగిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఇలానే నిరంకుశంగా వ్యవహరిస్తే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ నేతల పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు భట్టి విక్రమార్క.
Published by: Shiva Kumar Addula
First published: June 11, 2020, 3:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading