Home /News /telangana /

TELANGANA CONGRESS HAS CRITICIZED PRIME MINISTER NARENDRA MODI STANCE ON SECURITY LAPSES IN PUNJAB AND IT ALSO ACCUSED THE BJP NOT LIKING THE DALIT CHIEF MINISTER PRV

Telangana: "దళిత ముఖ్యమంత్రి బీజేపీకి నచ్చలేదు.. గతంలో ఏ ప్రధాని ఇంత చౌకబారు చేయలేదు.." : టీ కాంగ్రెస్​

మల్లు భట్టి విక్రమార్క, (File)

మల్లు భట్టి విక్రమార్క, (File)

పంజాబ్‌లో భద్రతా లోపం (security lapse in punjab) కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ (Narendra modi) తన పర్యటనను రద్దు చేసుకున్నసంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క (bhatti vikramarka) స్పందించారు.

పంజాబ్‌లో భద్రతా లోపం (security lapse in punjab) కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ (Narendra modi) తన పర్యటనను రద్దు చేసుకున్నసంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై దర్యాప్తు చేస్తున్నాయి. అటు పంజాబ్‌ డీజీపీపై రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసి ఆయన స్థానంలో మరొకరిని నియమించింది. ఈ వ్యవహారంపై టీ కాంగ్రెస్ (Telangana Congress)​ తరఫున సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క (Bhatti vikramarka) స్పందించారు. ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. పంజాబ్‌లో ప్రధాని మోదీ డ్రామా చేశారని విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం లా అండ్​ ఆర్డర్​ను దయనీయ స్థితిలో ఉంచిందని మండిపడ్డారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని చూస్తోందని అన్నారు. ధ్యానం కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలాడుతున్నాయని భట్టి ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు యాసంగి ధాన్యాన్ని  కొనుగోలు చేయాల్సిందేనని డిమాండ్​ చేశారు. తామర పురుగుతో లక్షల ఎకరాల మిర్చి పంటకు నష్టం ఏర్పడిందని, పసుపు, పత్తి పంటలకు కూడా నష్టపరిహారం అందించాలని అన్నారు.

గవర్నర్​ను కలుస్తాం..

‘‘తెలంగాణలో లా అండ్ ఆర్డర్ దయనీయ పరిస్థితిలో ఉంది. పోలీసులు యంత్రాంగాన్ని టీఆర్‌ఎస్‌ పార్టీ తన క్యాడర్ గా మార్చుకుంది. సీఎల్పీ బృందం.. గవర్నర్‌తో పాటు తెలంగాణ డీజీపీని కలవాలని నిర్ణయించింది. విద్యుత్ చార్జీల పెంచితే పోరాటం చేస్తాం. పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును టీఆర్‌ఎస్‌ (TRS) నుంచి సస్పెండ్‌ చేయాలని, వనమాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించాలంటూ భట్టి​ విక్రమార్క డిమాండ్‌ చేశారు.

ఇక పంజాబ్​లో ప్రధానికి జరిగిన భద్రతా లోపంపై కేంద్రం సీరియస్​ అవడంతో టీ కాంగ్రెస్​ స్పందించింది. ప్రధాని పదవి స్థాయిని మోదీ దిగజార్చారని భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ (congress) పంజాబ్‌లో (punjab) దళితుణ్ని ముఖ్యమంత్రిని చేస్తే బీజేపీకి  నచ్చలేదని ఆయన దుయ్యబట్టారు. గతంలో ప్రధానులు ఇంత చౌకబారుగా వ్యవహారాలు నడపలేదని భట్టి గుర్తుచేశారు. ఓ సభలో ఇందిరా గాంధీపై (Indira Gandhi) రాయి విసిరితే గాయమైనా చలించకుండా ప్రసంగం కొనసాగించారని ఆయన వెల్లడించారు. అయినా ఇందిరా అప్పటి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించలేదని భట్టి గుర్తుచేశారు. డ్రామా చేసి దళిత సీఎంను నవ్వుల పాలు చేయాలని చూశారని ఆయన పేర్కొన్నారు. జీవో నెం 317తో స్థానికత అనే దానికి న్యాయం లేకుండా పోయిందని భట్టి ఎద్దేవా చేశారు.

ఏం జరిగింది..?

పంజాబ్‌లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం భటిండా విమానాశ్రయంలో దిగారు. అక్కడి నుంచి ఆయన హెలికాప్టర్‌లో ఫిరోజ్‌పుర్‌లోని హుస్సేనీవాలాలో ర్యాలీలో ప్రసంగించాల్సి ఉంది. అయితే ఆయన హెలికాప్టర్‌ ప్రయాణానికి వాతావరణం ప్రతికూలంగా మారింది. దీంతో దాదాపు 20 నిమిషాలు విమానాశ్రయంలోనే ప్రధాని వేచి చూశారు. వాతావరణం మెరుగుపడకపోవడంతో.. రోడ్డు మార్గంలోనే హుస్సేనీవాలాకు వెళ్లాలని మోదీ నిర్ణయించుకున్నారు. ప్రధాని భద్రతా సిబ్బంది ఈ సమాచారాన్ని పంజాబ్‌ పోలీసులకు అందించారు.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Bhatti Vikramarka, Punjab, TS Congress

తదుపరి వార్తలు