• HOME
 • »
 • NEWS
 • »
 • TELANGANA
 • »
 • TELANGANA COLLEGE PROFESSOR INVENTS ROBOTIC EQUIPMENT FOR HELP PARAPLEGIA PATIENTS SU KMM

Telangana: నిలువలేని వారి పాలిటి వెన్నెముకగా.. ఓ ప్రొఫెసర్‌ నూతన ఆవిష్కరణ.. కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందిన డిజైన్‌

Telangana: నిలువలేని వారి పాలిటి వెన్నెముకగా.. ఓ ప్రొఫెసర్‌ నూతన ఆవిష్కరణ.. కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందిన డిజైన్‌

ప్రొఫెసర్ కాపుల ప్రభాకర్

పారాప్లజియా(Paraplegia).. ఇదో భయంకర వ్యాధి.. కారణం ఏదైనా.. వెన్నెముకకు దెబ్బ తగిలి నడుం కింది భాగం చచ్చుబడిపోయే స్థితి.

 • Share this:
  ఊపిరి సినిమాలో హీరో నాగార్జున పాత్ర కుర్చీకే పరిమితం కావడం.. బయటి ప్రపంచాన్ని చూడ్డానికి అతను పడే తపన.. సాయం చేయాల్సిన వాళ్లు సకాలంలో పట్టించుకోకపోతే కలిగే కష్టం.. యాతన.. మానసిక సంఘర్షణ.. చాలా మందే చూసి ఉంటారు. ఓ ఫ్రెంచ్ మూవీ మాతృకగా వచ్చిన ఈ సినిమాలో ఇలాంటి వ్యాధుల బారిన పడే వారి వేదన, వెతలను దర్శకుడు కళ్లకు గట్టాడు. మరి వీరి కష్టం ఎవరు తీరుస్తారు. ఆ సినిమాలో హీరో నాగార్జున బిలియనీర్‌ కనుక పని మనుషుల సాయంతో నెట్టుకొస్తారు. కానీ నిజజీవితంలో ఎందరో అభాగ్యులు.. ఇలా జన్యు కారణాల వల్లనో.. ప్రమాదాల వల్లనో ఈ వ్యాధి బారిన పడి జీవచ్ఛవల్లా బతుకీడుస్తున్నారు. వీరికోసం అన్నట్టు ఓ ప్రొఫెసర్‌ నిరంతరం శ్రమిస్తున్నారు. అందుబాటు ధరల్లో ఓ రోబోటిక్‌ పరికరాన్ని రూపొందించారు.

  పారాప్లజియా(Paraplegia).. ఇదో భయంకర వ్యాధి.. కారణం ఏదైనా.. వెన్నెముకకు దెబ్బ తగిలి నడుం కింది భాగం చచ్చుబడిపోయే స్థితి. కదలలేరు. వాళ్ల పనులు వాళ్లు సొంతంగా చేసుకోలేరు. పూర్తిగా మంచానికే పరిమితం అయ్యే పరిస్థితి. మహా అంటే చక్రాల కుర్చీ నుంచి మరొకరి సాయంతో బయటి ప్రపంచాన్ని చూడగలరు. అంతే. జన్యు పరమైన సమస్యలతో ఇలాంటి జబ్బుల బారిన పడే వారి సంఖ్య ఏటా ప్రపంచ వ్యాప్తంగా ఐదు లక్షలకు పైగా ఉంటుందన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. ఇలాంటి వారి కోసం గతంలో ఎన్నో ఆవిష్కరణలు వచ్చినా ఖర్చు రీత్యా అందుబాటులో లేని పరిస్థితి. దీంతో ఎందరో సామాన్య, మధ్య తరగతికి చెందిన వారికి ఎలాంటి సాయం అందే పరిస్థితి లేకుండా పోయింది. ఇలాంటి దుస్థితిలో చిక్కుకున్న వారికోసం భద్రాచలం పట్టణానికి చెందిన కాపుల ప్రభాకర్‌రావు పనిచేస్తున్నారు. స్వతహాగా ఎలక్ట్రానిక్స్‌లో ప్రొఫెసర్‌ అయిన ఈయన తన మేథస్సును ఉపయోగించి వీరికోసం ప్రత్యేక రోబోటిక్‌ పరికరాన్ని తయారుచేశారు.

  పనిచేస్తుందిలా.. పారాప్లజియా వ్యాధికి గురైన వారికి నడుం నుంచి పాదాల దాకా మోటార్స్‌తో కూడిన రోబోటిక్‌ పరికరాన్ని అమర్చుతారు. ఇది పనిచేయడానికి అనువుగా నడుం దగ్గర అమర్చిన బ్యాటరీ నుంచి విద్యుత్‌ సరఫరా అవుతుంటుంది. వీరికి ఓ ప్రత్యేకమైన చేతికర్రను అందిస్తారు. దీనికి అమర్చిన సెన్సర్స్‌ వ్యవస్థ ఆధారంగా స్విచ్‌ ఆన్‌ చేయగానే రోబోటిక్‌ పరికరం పనిచేయడం ప్రారంభిస్తుంది. మెల్లగా లేవడం.. ఒక్కో అడుగూ వేయడం.. అలా ఆరుబయట తిరగడం లాంటివి సొంతంగా ధైర్యంగా చేసుకోవచ్చు. ఇతరుల సాయం లేకుండానే వీరు సొంతంగా నడవగలిగే విధంగా ఈ పరికరాన్ని రూపొందించారు ప్రభాకర్‌. వాస్తవానికి ఇలాంటి ఆవిష్కరణలు గతంలో చాలా వచ్చినా ఎకానమీ పాయింట్‌లో నిలవలేకపోయాయి. దీంతో ఇవి కేవలం డబ్బున్న వారికే పరిమితం అన్నట్టుగా పరిస్థితి తయారైంది.  ఇక, ప్రభాకర్.. భద్రాచలం కొర్రాజులగుట్టలోని ఎయిడెడ్‌ హైస్కూల్‌లో స్కూలింగ్‌.. ప్రభుత్వ జూనియర్‌ కాలేజిలో ఇంటర్‌.. ఆంధ్ర యూనివర్శిటీలో బీఈ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, అనంతరం కాకినాడ జేఎన్‌టీయూ నుంచి ఎంటెక్‌ (ఇనుస్ట్రుమెంటేషన్‌ అండ్‌ కంట్రోల్‌) అనంతరం ఆంధ్ర యూనివర్శిటీ నుంచి పీహెచ్‌డీ చేశారు. ప్రస్తుతం ప్రభాకర్‌ మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లోని బివీరాజు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఈసీఈ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈయన తాను రూపకల్పన చేసిన ప్రాజెక్టుకు 'డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ ఏ వేరబుల్‌ ఫర్‌ మోషన్‌ అసిస్టెన్స్‌ ఇన్‌ పారాప్లిజిక్‌ పేషెంట్స్‌'గా పేరు పెట్టారు. దీనికి గానూ టెక్నాలజీ ఇంటర్‌వెన్షన్‌ ఫర్‌ డిజేబుల్డ్‌ అండ్‌ ఎల్డర్లీ పథకం కింద కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖకు 2018లో ధరఖాస్తు చేసుకోగా 2020 మే నెలలో అనుమతి లభించింది. మూడేళ్ల కాలవ్యవధి ఉన్న ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం రూ.57 లక్షలు కేటాయించింది. దీన్ని వీలైనంత మందికి తక్కువ ధరలకు అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తున్నట్టు ప్రభాకర్‌ చెబుతున్నారు.
  Published by:Sumanth Kanukula
  First published:

  అగ్ర కథనాలు