Telangana Drug Case : గంజాయి స్మగ్లింగ్ చేస్తూ దొరికిన స‌ర్పంచ్‌.. ఎక్క‌డంటే?

ప్రతీకాత్మకచిత్రం

Telangana : ఓ గ్రామ స‌ర్పంచ్ గంజాయి ర‌వాణాచేస్తూ ప‌ట్ట‌బ‌డ్డ ఘ‌ట‌న సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకొంది. మహారాష్ట్ర (Maharashtra) , కర్ణాటక (Karnataka) సరిహద్దు ప్రాంతం కావ‌డంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో సిద్దిపేట్, నారాయణఖేడ్ జహీరాబాద్ ప్రాంతాల నుంచి భారీగా గంజాయ్ అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతోంది. ఈ నేప‌థ్యంలో స‌ర్పంచ్ ప‌ట్టు ప‌డ‌డం ఉమ్మ‌డిజిల్లాలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

 • Share this:
  ఓ గ్రామ స‌ర్పంచ్ గంజాయి ర‌వాణాచేస్తూ ప‌ట్ట‌బ‌డ్డ ఘ‌ట‌న సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకొంది. మహారాష్ట్ర (Maharashtra) , కర్ణాటక (Karnataka) సరిహద్దు ప్రాంతం కావ‌డంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో సిద్దిపేట్, నారాయణఖేడ్ జహీరాబాద్ ప్రాంతాల నుంచి భారీగా గంజాయ్ అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతుంది. ఎండు గంజాయిని ప్యాకెట్ల ద్వారా వాహనాలలో హైదరాబాద్‌ (Hyderabad)కి తరలిస్తున్నారు. ఈ విష‌యం తెలిసి జిల్లా క‌లెక్ట‌ర్ హ‌నుమంత‌రావు స‌ర్పంచ్‌ను సస్పెండ్ (Suspend) చేశారు. గంజాయిపై ప్ర‌భుత్వం ఉక్కుపాదం మోపేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తుంటే ప్ర‌జా ప్ర‌తినిధులే గంజాయి ర‌వాణాను ప్రోత్స‌హించ‌డంపై ఉమ్మ‌డి జిల్లా వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.  ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి వివ‌రాలు ఇలా ఉన్నాయి.

  అస‌లేం జ‌రిగింది..
  పెద్ద శంకరంపేట్ వ‌ద్ద పోలీసులు వాహ‌నాలు త‌నిఖీ చేస్తున్నారు. ఈ త‌నిఖీల్లో పోలీసులు ఎండు గంజాయి పట్టుకొన్నారు. ఈ గంజాయి ర‌వాణాలో అధికార పార్టీకి చెందిన నారాయ‌ణ‌ఖేడ్ నియోజ‌వ‌ర్గానికి చెందిన‌ గరిడేగాం గామ స‌ర్పంచ్ బాలాజీ అడ్డంగా దొరికిపోయారు. ఈ విష‌యం జిల్లా క‌లెక్ట‌ర్ హ‌నుమంత‌రావు దృష్టికి రావ‌డంతో స‌ర్పంచ్‌ను స‌స్పెండ్ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

  దీంతో అధికార పార్టీకి చెంద‌ని ప్ర‌జాప్ర‌తినిధి ఇలా చేయ‌డం ఉమ్మ‌డిజిల్లా వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. గ‌తంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలో అప్ప‌టి ఎమ్మెల్యే కిష్టారెడ్డి నారాయ‌ణ‌ఖేడ్ నియోజ‌క‌వ‌ర్గంలో గంజాయి పండించే రైతులు ప్ర‌త్యేక నిఘా పెట్టి చ‌ర్య‌లు తీసుకొన్నారు. ఇటీవ‌ల ప్ర‌భుత్వం గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు చ‌ర్య‌లు తీసుకొంటోంది.

  కేసీఆర్ ప్ర‌త్యేక దృష్టి..
  ఓవైపు ఏపీలో డ్రగ్స్ రాజకీయం పతాకస్థాయికి చేరగా, తెలంగాణలో మాదక ద్రవ్యాల కట్టడిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో గంజాయి అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని ఇటీవ‌ల‌ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ నేప‌థ్యంలో ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. గంజాయి సాగు చేసే రైతులకు రైతు బంధు, రైతు బీమా రద్దు చేయాలని నిర్ణయించారు. ఆర్ఓఎఫ్ఆర్ఓలో గంజాయి సాగు చేస్తే..

  Telangana Inter Exams : ప‌రీక్ష‌లంటే భ‌య‌మా.. అయితే కాల్ చేయండి : క్లినిక‌ల్ సైకాల‌జిస్టు ప్యాన‌ల్‌ ప్ర‌వేశ‌పెట్టిన ఇంట‌ర్ బోర్డు


  వారి పట్టాలను కూడా రద్దు చేస్తామని స్పష్టం చేశారు. గంజాయిపై యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఏర్పడిందన్న సీఎం.. పరిస్థితి తీవ్రతరం కాకముందే అప్రమత్తం కావాలని అన్నారు. గంజాయి ఉత్పత్తిని సమూలంగా నిర్మూలించడానికి తగిన ప్రణాళికను సిద్ధం చేయాలని ఉన్నతాధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

  ప్రగతి భవన్ వేదికగా బుధవారం నాడు డ్రగ్స్ వ్యవహారంపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. డ్రగ్స్ ను అరికట్టేలా పోలీస్, ఎక్సైజ్ శాఖను మరింత ఆధునీకరించాలని సీఎం భావిస్తున్నారు. గుడుంబా నిర్మూలన, పేకాట క్లబ్బులపై నిషేధం వంటి అంశాలు కూడా అజెండాలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల మాఫియా పెచ్చుమీరుతున్న నేపథ్యంలో తెలంగాణలో వాటి కట్టడికి ఏం చేయాలో కేసీఆర్ నిర్దేశిస్తారు. హైదరాబాద్ శివార్లలోని ఆ అనుమానిత పరిశ్రమలపై ఉక్కుపాదం మోపుతారా? తెలంగాణ డ్రగ్స్ మాఫియాపై కేసీఆర్ మూడో కన్ను తెరుస్తారా? అనేది హాట్ టాపిక్ అయింది.

  - వీర‌న్న‌, మెద‌క్‌, న్యూస్‌18తెలుగు

  Published by:Sharath Chandra
  First published: