ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు.. ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ

ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్

కరోనా కారణంగా ఏప్రిల్ నెలలో తెలంగాణ ప్రభుత్వం 83శాతం రెవెన్యూను కోల్పోయిందని.. అదే సమయంలో కరోనా కట్టడికి ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చిందని అన్నారు. కేంద్రమే రుణం తీసుకుని పూర్తి స్థాయిలో రాష్ట్రాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు సీఎం కేసీఆర్.

 • Share this:
  జీఎస్టీ చట్టాన్ని కేంద్రం ఉల్లంఘించిందని తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారరం తగ్గించాలన్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి మంగళవారం లేఖ రాశారు చంద్రశేఖర్ రావు. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం పూర్తిగా చెల్లించాలని ప్రధాని మోదీని విజ్ఞప్తి చేశారు. కేంద్రమే రుణం తీసుకొని రాష్ట్రాలకు పూర్తి పరిహారం చెల్లించాలని కోరారు. చట్టం ప్రకారం 14 శాతం వృద్ధి రేటు ఆధారంగా రాష్ట్రాలకు ఆదాయం తగ్గితే.. కేంద్రమే పరిహారం చెల్లించాలని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.

  యూపీఏ ప్రభుత్వం కూడా రాష్ట్రాలకు హామీ ఇచ్చి మాట తప్పిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు సీఎం. ఆ అనుభవంతో ఎన్డీయే కూడా అలానే చేస్తుందేమోనని జీఎస్టీని ప్రశ్నించామని చెప్పారు. అనుకున్నట్లుగానే ఇప్పుడు జీఎస్టీ పరిహారం చెల్లింపుల్లో కోత విధిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం తప్పకుండా ఇస్తామని చట్టంలో చెప్పి ..ఇవాళ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని విమర్శలు గుప్పించారు. కరోనా కారణంగా ఏప్రిల్ నెలలో తెలంగాణ ప్రభుత్వం 83శాతం రెవెన్యూను కోల్పోయిందని.. అదే సమయంలో కరోనా కట్టడికి ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చిందని అన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమే రుణం తీసుకుని పూర్తి స్థాయిలో రాష్ట్రాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు సీఎం కేసీఆర్.

  మంగళవారం తెలంగాణ ఆర్థిక మంత్రి కూడా కేంద్రంపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. చట్టం ప్రకారం జీఎస్టీ పరిహారం రూ.3 లక్షల కోట్లకు గాను.. రూ.లక్షా 65 వేల కోట్లకు తగ్గించడాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆక్ష్న అన్నారు. 14 శాతం వృద్ధి రేటు ప్రకారం పూర్తి స్థాయిలో జీఎస్టీ పరిహారం చెల్లించాలని చట్టంలో పేర్కొన్నారని.. కానీ యాక్ట్ ఆఫ్ గాడ్ పేరిట, కరోనా పేరిట రూ.లక్షా 35 వేల కోట్ల నష్టపరిహారాన్ని ఇవ్వకుండా ఎగ్గొట్టాలని చూస్తోందని ధ్వజమెత్తారు హరీష్ రావు. తాజాగా ఇదే అంశంపై కేంద్రానికి లేఖరాశారు తెలంగాణ సీఎం కేసీఆర్.
  Published by:Shiva Kumar Addula
  First published: