Home /News /telangana /

TELANGANA CM KCR WILL HOLD A PRESS MEET AT 4 PM TODAY AT HYDERABAD FULL DETAILS HERE PRV

KCR Press meet: సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ ప్రెస్​మీట్​​.. అసెంబ్లీ రద్దా? ఉప ఎన్నికా? నేడు తేలిపోనుందా?

సీఎం కేసీఆర్​ (ఫైల్​ ఫొటో)

సీఎం కేసీఆర్​ (ఫైల్​ ఫొటో)

ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రోసారి మీడియా ముందుకు రానున్నారు. శ‌నివారం సాయంత్రం 4 గంట‌ల‌కు సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    తెలంగాణ రాజకీయాలు (Telangana Politics) రోజురోజుకీ రసవత్తరంగా మారుతున్నాయి. మునుగోడు ఎమ్మెల్యే (Munugodu MLA) కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి కాంగ్రెస్​కు రాజీనామా చేయడం.. ఎంపీ కోమటి రెడ్డిని బీజేపీ చీఫ్​ బండి సంజయ్​ మద్దతుదారుడనడం.. మరోవైపు కోమటిరెడ్డి బ్రదర్స్​ టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డిపై విమర్శలు గుప్పించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇక మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తేనే అక్కడ కేసీఆర్ (CM KCR)​ అభివృద్ధి చేస్తారని రాజగోపాల్ రెడ్డి ఆరోపణలు చేయడంతో టీఆర్​ఎస్​ ఇరుకున పడింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు మ‌రోసారి మీడియా ముందుకు రానున్నారు. శ‌నివారం సాయంత్రం 4 గంట‌ల‌కు సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు. ఈ ప్రెస్‌మీట్ (CM KCR Press meet) ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌ర‌గ‌నుంది. రాష్ట్రానికి సంబంధించిన అంశాల‌తో పాటు ఇత‌ర అంశాల‌పై కూడా కేసీఆర్ మీడియాతో మాట్లాడే అవ‌కాశం ఉంది. కేసీఆర్ ప్రెస్‌మీట్‌లో ఏం మాట్లాడుతారా? అన్న విష‌యంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి మొద‌లైంది.

    బీజేపీ చేతిలో ఓడిపోతే..

    మునుగోడు ఉప ఎన్నికల కంటే ముందే మొత్తం అసెంబ్లీని రద్దు  (Dissolution of the Assembly) చేసేస్తే? ముందస్తు ఎన్నికలకు వెళ్తే? టీఆర్‌ఎస్ లో ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోందని, మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి పాలైతే... బీజేపీ చేతిలో ఓడిపోతే... ఇక రాష్ట్రవ్యాప్తంగా సంచలన పరిణామాలు, భారీగా వలసలకు అది కారణమవుతుందని, దాంతో రాజకీయ వాతావరణమే మారిపోతుందని, దాన్ని నివారించేదుకు టీఆర్ఎస్ ముందస్తు అస్త్రాన్ని ప్రయోగించే దిశగా సమాలోచనలు జరుపుతోందని, అందుకోసం అసెంబ్లీ రద్దు దిశగానూ చర్చోపచర్చలు జరుగుతున్నట్లు ‘ఆంధ్రజ్యోతి’ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది.

    సీఎం కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ అన్నట్లుగా సాగిన హుజూరాబాద్‌ కంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో అనివార్యమైన మునుగోడు ఉప ఎన్నికపైనే (BY Elections) బీజేపీ అధినాయకత్వం సీరియ్‌సగా దృష్టి పెట్టిందని, ఇదులోగానీ పొరపాటున ఓడితే ఆ తర్వాత జరిగే సాధారణ ఎన్నికల్లో ఫలితాలు ఎలాగైనా ఉండొచ్చని, కాబట్టి మునుగోడు ఉప ఎన్నికలనే సెమీ ఫైనల్‌ను ఆడకుండా నేరుగా ఫైనల్‌కు వెళ్లిపోతే బాగుంటుందనే ఆలోచన టీఆర్ఎస్ కనిపిస్తోందని కథనంలో పేర్కొన్నారు.



    నిజానికి ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ గత నెలలలో కేంద్రానికి సంచలన సవాలు విసిరారు. దమ్ముంటే బీజేపీ ఎన్నికల తేదీని ప్రకటిస్తే, తాను అసెంబ్లీ రద్దు చేస్తానని సీఎం వ్యాఖ్యానించడం తెలిసిందే. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో అదే ముందస్తు ప్రతిపాదనపై ఆ పార్టీలో తాజా చర్చకు తెర లేచిందని సమాచారం. మునుగోడు ఉప ఎన్నికపై సీఎం కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో విస్తృత సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ, అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికలపై మాత్రం సీఎం నేరుగా ఎక్కడా మాట్లాడలేదు. తాజాగా నేడు సీఎం ప్రెస్​మీట్​ పెడుతుండటంతో ఆయన మాటలను బట్టి ఉప ఎన్నికకు వెళ్లనున్నారా లేదా అనేది తేలనుంది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Bjp, CM KCR, Digital media, Komatireddy rajagopal reddy, Nalgonda, Telangana Politics, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు