Home /News /telangana /

TELANGANA CM KCR WILL DECIDED AGITATION ON CENTRE REGARDING PADDY PROCUREMENT ISSUE AK

Telangana: కేంద్రంతో వరి యుద్ధం.. రోడ్ మ్యాప్ రెడీ చేస్తున్న కేసీఆర్.. ఇలా చేయనున్నారా ?

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

KCR Versus Centre: కేంద్రం ధాన్యం కొనుగోలు విషయంలో క్లారిటీ ఇవ్వడంతో.. ఈ అంశంపై కేంద్రంపై ఏ రకంగా పోరాటం చేయాలనే అంశంపై సీఎం కేసీఆర మంత్రులతో చర్చిస్తున్నారు.

    తెలంగాణలో రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేసింది. అయితే ఇది సాధ్యపడే విషయం కాదని.. సరఫరా, అవసరాలు, ముందుగా చేసుకున్న ఒప్పందం మేరకు మాత్రమే రాష్ట్రం నుంచి ధాన్యం(Paddy Procurment) కొనుగోలు చేస్తామని కేంద్ర ఆహారమంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తనతో సమావేశమైన తెలంగాణ మంత్రులతోనూ చెప్పారు కేంద్రమంత్రి గోయల్. కేంద్రమంత్రి తమకు చెప్పిన విషయాలను ముఖ్యమంత్రికి వివరించిన మంత్రులు.. భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండాలనే అంశంపై ఆయనతో చర్చిస్తున్నారు. కేంద్రం ధాన్యం కొనుగోలు విషయంలో క్లారిటీ ఇవ్వడంతో.. ఈ అంశంపై కేంద్రంపై ఏ రకంగా పోరాటం చేయాలనే అంశంపై సీఎం కేసీఆర్ (cm kcr) మంత్రులతో చర్చిస్తున్నారు.

    ఈ సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. యాసింగిలో రైతులు పండించే పంట త్వరలోనే కోతకు రానుంది. దాన్ని కొనుగోలు చేయడంతో పాటు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఏ విధంగా ముందుకు సాగాలనే దానిపై టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఉగాది తరువాత ఈ మేరకు ముందుకు సాగాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. గతంలో సీఎం కేసీఆర్ చెప్పిన విధంగా ఢిల్లీలోని ఇండియా గేట్ ముందు ధాన్యంను పోసి నిరసన తెలిపే అంశం కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం.

    ఈ నిరసన కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌తో పాటు దేశవ్యాప్తంగా తమతో కలిసి వచ్చే నేతలను కలుపుకుని ముందుకు సాగాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విషయంలో పంజాబ్ తరహాలో తీవ్రంగా ఉద్యమం సాగించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. అలా చేయడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావొచ్చనే యోచనలో ఉంది. ఈ ఉద్యమంలో రైతులు కూడా భాగస్వాములను చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం.

    Piyush Goyal: మాకు పంజాబ్‌ అయినా తెలంగాణ అయినా ఒక్కటే.. కేసీఆర్‌కు కేంద్రం కౌంటర్

    Telanagana : ఢిల్లీలో ధాన్యం.. గల్లీలో గ్యాస్ ధరలపై టీఆర్ఎస్ పోరు.. నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

    రైతులు పండించిన యాసంగి పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తూనే.. కేంద్రంపై పోరాటం చేయాలని.. అలా చేయడం వల్ల రైతులు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి వచ్చే అవకాశం ఉందని మంత్రులతో సీఎం కేసీఆర్ నిర్వహించిన సమావేశంలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ అంశంపై జాతీయ స్థాయిలో కదలిక రావాలంటే కేంద్రమంత్రుల ఇంటి ముందు కూడా ధర్నాలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నట్టు టాక్. మొత్తానికి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం క్లారిటీ ఇవ్వడంతో.. ఈ అంశంపై కేంద్రంతో తీవ్రస్థాయిలో పోరాటం చేసేందుకు టీఆర్ఎస్ సర్కార్ సమాయత్తమవుతున్నట్టు తెలుస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: CM KCR, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు