తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (సీఎం కేసీఆర్) (CM KCR) సతీమణి శోభ ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా పోస్ట్ కొవిడ్ ఇబ్బందులు, ఊపిరితిత్తుల సమస్యతో ఆమె బాధపడుతున్నారు. వైద్య పరీక్షల కోసం శుక్రవారం నాడే ఆమె ఢిల్లీకి వెళ్లారు. ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా నేతృత్వంలోని వైద్యుల బృందం శోభకు పలురకాల టెస్టులు నిర్వహించారు. వాటి ఫలితాలను విశ్లేషించిన డాక్టర్లు.. ఇన్ పేషెంట్ గా ఆస్పత్రిలో చేరాలని శోభకు సూచింరారు. వాస్తవానికి వైద్యపరీక్షల అనంతరం శనివారమే వారు హైదరాబాద్ తిరిరావాలని అనుకున్నా, డాక్టర్ల సూచనతో ఆస్పత్రిలో చేరక తప్పలేదు.
కల్వకుంట్ల శోభమ్మకు ఢిల్లీలో వైద్య పరీక్షలు చేయించేందుకు కొడుకు కేటీఆర్, కూతురు కవిత వెంట వెళ్లారు. శనివారమే వీరు తిరిగి రావాల్సి ఉన్నా రిపోర్టుల మేరకు తల్లిని ఎయిమ్స్ లో చేర్పించారు. ఆదివారం సాయంత్రం సీఎం కేసీఆర్ కూడా ఢిల్లీకి పయనమయ్యారు. దీంతో సీఎం కుటుంబమంతా ఢిల్లీకి చేరినట్లయింది. ఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగిన వెంటనే కేసీఆర్ నేరుగా ఎయిమ్స్ కు వెళ్లి భార్యను కలుస్తారని తెలుస్తోంది.
కరోనా సెకండ్ వేవ్ సమయంలో సీఎం కేసీఆర్ కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ కావడం, ఆ వెంటనే ఆయన భార్య శోభకు కూడా వైరస్ సోకడం తెలిసిందే. అటు కూతురు కవిత, కొడుకు కేటీఆర్ కూడా కరోనా బారినపడ్డారు. మిగతా ముగ్గురూ కోలుకుని పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, శోభమ్మకు మాత్రం ఊపిరితిత్తుల సమస్య తలెత్తింది. హైదరాబాద్ లోని ఆస్పత్రుల్లో చూయించినా, డాక్టర్ గులేరియాను కలవడమే ఉత్తమం అనే సలహా రావడంతో వారు ఢిల్లీ ఎయిమ్స్ వెళ్లారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం సమస్య చాలా చిన్నదేనని, అబ్జర్వేషన్ తర్వాత ఎయిమ్స్ వైద్యులు ఆమెను డిశ్చార్జ్ చేస్తారని తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.