TELANGANA CM KCR WIFE SHOBA AND MLC KALVAKUNTLA KAVITHA AND FAMILLY MEMBERS VISIT VARANASI BA
KCR Family Varanasi Tour: వారణాసిలో సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల పర్యటన
వారణాసిలో పర్యటిస్తున్న కేసీఆర్ కుటుంబసభ్యులు
తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుటుంబసభ్యులు ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో పర్యటించనున్నారు. ఈరోజు, రేపు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి ప్రత్యేక పూజలు చేయనున్నారు.
తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుటుంబసభ్యులు ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో పర్యటిస్తున్నారు. ఈరోజు, రేపు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి ప్రత్యేక పూజలు చేయనున్నారు. సీఎం సతీమణి శోభ, కూతురు ఎమ్మెల్సీ కవిత, ఇతర కుటుంబసభ్యులు వారణాసికి చేరుకున్నారు. తొలుత అస్సి ఘాట్ నుంచి దశాశ్వమేధ ఘాట్ వరకు బోటులో ప్రయాణం చేయనున్నారు. దశాశ్వమేధ ఘాట్‌లో గంగా ఆర్తి, గంగా పూజను తిలకిస్తారు. అనంతరం అస్సి ఘాట్‌కు బోటులో తిరుగు ప్రయాణం కానున్నారు. తర్వాత సంకట్మోచన్ దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.వారణాసి పర్యటనపై ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రం కాశీ విశ్వనాథున్ని కుటుంబ సభ్యులతో పాటు దర్శించుకోబోతుండటం సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం సహజంగా దైవభక్తి ఎక్కువ. గతంలో సాక్షాత్తూ సీఎం కేసీఆర్ యాగాలు కూడా చేశారు. తాజాగా తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ కుటుంబం వారణాసిలో పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
(Source: SuryaEpaper)
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.