Home /News /telangana /

TELANGANA CM KCR UNLIKELY TO ATTEND AMIT SHAH LED SZC MEETING IN TIRUPATI ON SUNDAY HM ALI TO REPRESENT TS MKS

kcr మరో సంచలనం -amit shahతో కీలక మీటింగ్‌కు డుమ్మా -తిరుపతి SZC భేటీపై రాజకీయ నీడలు?

అమిత్ షాతో భేటీకి కేసీఆర్ డుమ్మా

అమిత్ షాతో భేటీకి కేసీఆర్ డుమ్మా

కేంద్రంపై ఎరకంగానూ కాంప్రమైజ్ ధోరణి ఉండరాదనే ఉద్దేశంతోనే కేసీఆర్ సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ కు వెళ్లరాదని నిర్ణయించుకున్నట్లు వాదన వినిపిస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన తిరుపతిలో ఆదివారం(నవంబర్ 14న) జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి నాలుగు రాష్ట్రాల సీఎంలు, ముగ్గురు లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరుకానున్నారు..

ఇంకా చదవండి ...
కేంద్రంలోని మోదీ సర్కార్.. తెలంగాణకు అన్ని రకాలుగా అన్యాయం చేస్తున్నదని, ఇన్నాళ్లూ ఓపిక పట్టినా ఇకపై ఊరుకోబోమని, దేశంలో అగ్గిపెడతామని దాదాపు యుద్ధభేరి మోగించిన సీఎం కేసీఆర్ ఆ దిశగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దక్షణాది రాష్ట్రాలకు సంబంధించి అత్యంత కీలకమైన, నలుగురు ముఖ్యమంత్రులు, ఇద్దరు లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొంటోన్న ‘సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్(ఎస్‌జెడ్‌సీ భేటీ)’కు సీఎం కేసీఆర్ హాజరు కావడంలేదు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఆదివారం(నవంబర్ 14న) తిరుపతిలో జరుగనున్న ఎస్‌జెడ్‌సీ మీటింగ్ కు కేసీఆర్ డుమ్మా కొట్టడం వెనుక రాజకీయ కారణాలూ ఉన్నాయనే చర్చ నడుస్తోంది.

మనసు మార్చుకున్న కేసీఆర్..
కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం, ప్రాంతీయ సమస్యల పరిష్కారం, పలు అంశాల్లో రాష్ట్రాల మధ్య సహకారం తదితర అంశాలే అజెండాగా కేంద్రం.. జోన్ల వారీగా స్థానిక పాలకులతో ఏటా సమావేశాలు నిర్వహిస్తుండటం తెలిసిందే. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశాలకు ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ సీఎంలతోపాటు పుదుచ్చేరి, అండమాన్, లక్ష్యద్వీప్ కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. కరోనా కారణంగా గత సమావేశాలు వాయిదా పడగా, రెండేళ్ల తర్వాత ఏపీలోని తిరుపతి వేదికగా ఆదివారం(నవంబర్ 14న) కౌన్సిల్ భేటీ కానుంది. రెండేళ్ల తర్వాత జరుగుతోన్న సమావేశాలు కావడంతో ఎస్‌జెడ్‌సీ మీటింగ్ కు సీఎం కేసీఆర్ స్వయంగా వెళతారని కొద్ది రోజుల కిందట ప్రగతి భవన్, సచివాలయ వర్గాలు తెలిపాయి. కానీ అనూహ్య రీతిలో కేసీఆర్ మనసు మార్చుకుని, అమిత్ షా అధ్యక్షతన భేటీకి వెళ్లరాదని నిర్ణయించుకున్నట్లు తాజా సమాచారం.

రాజకీయ విభేదాలే కారణమా?
పరిపాలనలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం కీలకంగా భావించే జోనల్ కౌన్సిల్ మీటింగ్ కు సీఎం కేసీఆర్ డుమ్మా కొట్టాలనుకోవడం వెనుక రాజకీయ కారణాలూ ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ప్రతిష్టాత్మక హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓటమి, బీజేపీ ఈటల రాజేందర్ గెలుపు తర్వాత రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కడం, బీజేపీని తీవ్రస్థాయిలో దూషించిన సీఎం కేసీఆర్.. దేశంలో అగ్గి పుట్టిస్తానంటూ కేంద్రంపై యుద్ధభేరీ మోగించడం, వరి ధాన్యం సేకరణ అంశంలో కేంద్రం తీరును నిరసిస్తూ టీఆర్ఎస్ శ్రేణులు శుక్రవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు నిర్వహించడం తదితర పరిణామాల నేపథ్యంలో కేంద్రంపై ఎరకంగానూ కాంప్రమైజ్ ధోరణి ఉండరాదనే ఉద్దేశంతోనే కేసీఆర్ సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ కు వెళ్లరాదని నిర్ణయించుకున్నట్లు వాదన వినిపిస్తోంది. కాగా,

దక్షిణాది సీఎంలు..
కరోనా కారణంగా వాయిదా పడ్డ సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ నిజానికి ఈ ఏడాది మార్చిలో జరగాల్సి ఉన్నా, అప్పుడు అమిత్ షా అనారోగ్యానికి గురికావడంతో రెండోసారి వాయిదా పడింది. ఇప్పుడు తిరుపతి వేదికగా ఆదివారం జరిగే కౌన్సిల్ భేటీకి భారీ ఏర్పాట్లు చేశారు. ఏపీ సీఎం జగన్ ఉపాధ్యక్షుడిగా జరుగుతోన్న సమావేశానికి తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైలతోపాటు పుదుచ్చేరి, లక్ష్యద్వీప్, అండమాన్ ల లెఫ్టినెట్ గవర్నర్లు హాజరు కానున్నారు.

తెలంగాణ తరఫున ఎవరంటే..
సీఎం కేసీఆర్ గౌర్హాజరీలో తెలంగాణ తరఫున హోం మంత్రి మహమూద్ అలీ ఎస్‌జెడ్‌సీ మీటింగ్ కు వెళతారు. తెలంగాణకు సంబంధించి సాగునీటి వివాదాలు, విభజన చట్టం హామీలు తదితర అంశాలను అలీ లేవనెత్తబోతున్నట్లు సమాచారం. కాగా, ఎస్‌జెడ్‌సీ సమావేశానికి సీఎం వెళ్లకపోవడం వెనుక రాజకీయ కారణాలు ఉండొచ్చన్న చర్చకు సమాధానంగా ప్రభుత్వ వర్గాలు కీలక విషయాన్ని ప్రస్తావించాయి. తెలంగాణ ఏర్పడిన నాటినుంచీ ఏ సమావేశానీకీ సీఎం కేసీఆర్ హాజరుకాలేదని, హోం మంత్రినో, ప్రధాన కార్యదర్శినో పంపేవారని గుర్తుచేస్తున్నారు.
Published by:Madhu Kota
First published:

Tags: Amit Shah, CM KCR, Telangana

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు