యాదాద్రి పూర్తైందా... నేడు కేసీఆర్ పర్యటన

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి ఎప్పుడు పూర్తవుతుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. నిర్మాణం దాదాపు పూర్తవడంతో సీఎం కేసీఆర్ ఇవాళ పరిశీలించబోతున్నారు.

news18-telugu
Updated: December 17, 2019, 5:25 AM IST
యాదాద్రి పూర్తైందా... నేడు కేసీఆర్ పర్యటన
సీఎం కేసీఆర్, యాదాద్రి ఆలయం
  • Share this:
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పునర్నిర్మాణ ఆలయ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇక ఆలయాన్ని సంప్రదాయబద్ధంగా ముహూర్తం ప్రకారం ప్రారంభించడమే మిగిలివుంది. ఇందుకు సంబంధించి తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ యాదాద్రి పర్యటనకు వెళ్తున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన ఆలయాన్ని చేరుకుంటారు. బాలాలయంలో స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత కొత్తగా నిర్మించిన ఆలయం, అభివృద్ధి పనులు ఎంతవరకూ పూర్తయ్యాయో దగ్గరుండి చూస్తారు. ఇటీవల ఈ ఆలయ నిర్మాణం, ప్రతిమలు, విగ్రహాల నిర్మాణంలో విమర్శలు రావడంతో... వాటిని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇవాళ్టి పర్యటనలో ఇలాంటి అంశాల్ని కూడా కేసీఆర్ చర్చిస్తారని తెలిసింది. ఆలయం ఎప్పుడు ప్రారంభించేదీ ముహూర్తం నిర్ణయించాక... మహా సుదర్శన నరసింహ యాగం చేస్తామని ఇదివరకు కేసీఆర్ హామీ ఇచ్చారు. దాదాపు 100 ఎకరాల్లో 1,018 యజ్ఞకుండాలతో మహా సుదర్శన యాగానికి అనువైన స్థలంగా గండి చెరువు ప్రాంతాన్ని ఎంపిక చేశారు. అక్కడకు చేరేందుకు రవాణా మార్గాలు, దేశ విదేశాల నుంచి వచ్చే మఠాధిపతులు, పీఠాధిపతులతోపాటు ఆధ్యాత్మిక గురువులకు హోటళ్లు, వసతి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆలయ ప్రారంభానికి ముహూర్తంపై చిన జీయర్‌స్వామితో సంప్రదింపులు జరుపుతారని తెలిసింది. అలాగే కొండచుట్టూ నిర్మాణంలో ఉన్న ఆరు లేన్ల రహదారి, నిర్వాసితుల పునరావాసం వంటి అంశాల్ని కూడా సీఎం కేసీఆర్ లెక్కలోకి తీసుకుంటారు.
Published by: Krishna Kumar N
First published: December 17, 2019, 5:23 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading