K Chandrashekar Rao: కరీంనగర్‌కు సీఎం కేసీఆర్.. దళితబంధుపై అధికారులకు దిశానిర్దేశం

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Telangana: శుక్రవారం ఉదయం రూప్ సింగ్ ఇంట జరిగే వివాహ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరవుతారు. అనంతరం అక్కడ దళితబంధుపై సమీక్ష నిర్వహించనున్నారు.

  • Share this:
    తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు కరీంనగర్ లో పర్యటించనున్నారు. కార్మిక విభాగం నాయకుడు ఎల్ . రూప్ సింగ్ కూతురి వివాహానికి సీఎం కేసీఆర్(CM KCR) హాజరు కానున్నారు . అనంతరం దళితబంధు(Dalita Bandhu) నిధుల వినియోగంపై సమీక్ష జరపనున్నారు. ఇందుకోసం గురువారం రాత్రి వరంగల్‌లో జరగనున్న రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఇంట్లో వివాహానికి కేసీఆర్ హాజరుకానున్నారు. అనంతరం అక్కడి నుండి నేరుగా కరీంనగర్(Karimnagar) వెళ్లనున్నారు. అక్కడి నుంచి తీగలగుట్టపల్లిలోని కేసీఆర్ భవన్‌కు చేరుకుంటారు. శుక్రవారం ఉదయం రూప్ సింగ్ ఇంట జరిగే వివాహ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం అక్కడ దళితబంధుపై సమీక్ష నిర్వహించనున్నారు.

    ఇదిలా ఉంటే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ దళిత బంధు పథకం పైలట్ ప్రాజెక్టు నిర్వహణకు నేడు మరో 500 కోట్ల రూపాయలను కరీంనగర్ కలెక్టర్ ఖాతాకు రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ విడుదల చేసింది. దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టు కోసం హుజూరాబాద్ ప్రారంభోత్సవం సభలో ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ. 2000 కోట్ల నిధుల లక్ష్యం, నేడు విడుదల చేసిన రూ. 500 కోట్లతో సంపూర్ణమైంది. పైలట్ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పూర్తిచేసుకుంది. సీఎం కెసిఆర్ ఆదేశాలతో పూర్తి నిధులు నిధులు విడుదల కావడంతో ఇక దళిత బంధు పథకాన్ని నిబంధనలను అనుసరిస్తూ సిఎం కెసిఆర్ ఆకాంక్షల మేరకు చక చకా అమలు చేయడమే మిగిలింది.

    Huzurabad: టీఆర్ఎస్‌కు కొత్త టెన్షన్.. హుజూరాబాద్‌లో ఆ పార్టీ బరిలోకి దిగుతుందా ?

    హుజూరాబాద్ వేదికగా దళిత బంధు పథకం ప్రారంభోత్సం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని దళితులందరికీ దళిత బంధు అందజేయనున్నట్టు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న దళితులకు కూడా దళిత బంధు వర్తింపజేయనున్నట్టు వెల్లడించారు. తొలుత ‘జై భీం’ అంటూ సీఎం కేసీఆర్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఆర్వాత సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తొలుత హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అమలు చేస్తున్నామని.. ఇది పథకానికి ప్రయోగశాల వంటిందని అన్నారు. ఇక్కడ సాధించే అభివృద్ది తెలంగాణలో దళిత బంధు అమలకు ఆదర్శం కావాలి అన్నారు. దళిత బంధు అమలుతో.. భార‌తదేశంలోని ద‌ళిత జాతి మేల్కొంటుందని. ఉద్య‌మ స్ఫూర్తి వ‌స్తుందని వ్యాఖ్యానించారు. హుజూరాబాద్‌లోని ప్రతి ఒక్క దళిత కుటుంబానికి రెండు నెలల్లో డబ్బులు ఇస్తామని చెప్పారు.
    Published by:Kishore Akkaladevi
    First published: