Trump India Tour : ట్రంప్‌కి రాష్ట్రపతి విందు... సీఎం కేసీఆర్‌కి ప్రత్యేక ఆహ్వానం...

Trump India Tour : అమెరికా అధ్యక్షుడి పర్యటనలో వీలైనన్ని రాష్ట్రాలకు భాగస్వామ్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ముఖ్యమంత్రులకు రాష్ట్రపతి విందు ఆహ్వానం లభిస్తోంది.

news18-telugu
Updated: February 22, 2020, 12:04 PM IST
Trump India Tour : ట్రంప్‌కి రాష్ట్రపతి విందు... సీఎం కేసీఆర్‌కి ప్రత్యేక ఆహ్వానం...
డొనాల్డ్ ట్రంప్, సీఎం కేసీఆర్
  • Share this:
Trump India Tour : ఈ నెల 24 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... కుటుంబంతో సహా... ఇండియా వస్తున్నారు కదా. తొలిరోజు ఆయన గుజరాత్... అహ్మదాబాద్‌లో పర్యటించనుండగా... రెండో రోజు అంటే... 25న ఆయన ఫ్యామిలీ ఢిల్లీ, ఆగ్రాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా... అదే రోజు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్... డొనాల్డ్ ట్రంప్‌ ఫ్యామిలీకి విందు ఇవ్వబోతున్నారు. ఈ సందర్భంగా వీలైనన్ని రాష్ట్రాలను ఇందులో భాగస్వామ్యం చెయ్యాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. అందువల్ల 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విందు కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా... ఆహ్వానాలు అందుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి రాష్ట్రపతి ఆఫీస్‌ నుంచి ఆహ్వానం అందినట్లు తెలిసింది. అందువల్ల ఈ నెల 25న కేసీఆర్... ఢిల్లీ వెళ్లబోతున్నారు. కేసీఆర్‌తో పాటూ... మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటక, ఒడిశా, బీహార్ సీఎంలకు కూడా ఆహ్వానం అందినట్లు తెలిసింది. ఆ ప్రకారం ఆ రాష్ట్రాల సీఎంలు కూడా విందుకు వెళ్లబోతున్నారు. అందువల్ల ఈ విందు కార్యక్రమం ట్రంప్ టూర్‌లో ప్రత్యేకమైనదిగా నిలవబోతోంది.

సాధారణంగా... రాష్ట్రపతి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఇలాంటి విందు కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఒక్కోసారి ఎంపీలకు టీ పార్టీ ఇస్తారు. ఈసారి ఇచ్చే విందులో ట్రంప్ ఫ్యామిలీకి ప్రత్యేక ఆహారంతోపాటూ... వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులందరికీ సెట్ అయ్యే ఆహార పదార్థాల్ని అందించబోతున్నట్లు తెలిసింది. మొత్తంగా ట్రంప్ రాకపై... అన్ని రాష్ట్రాలూ ఇన్వాల్వ్ అయ్యేలా కేంద్రం చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్తోంది.

ఇక ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్‌లో ట్రంప్ ఫ్యామిలీ కోసం గ్రాండ్ ప్రెసిడెన్షియల్ సూట్ రెడీ అయ్యింది. ప్రస్తుతం ఆ హోటల్ పూర్తిగా భద్రతాధికారుల పర్యవేక్షణలోకి వెళ్లిపోయింది. రెండు వారాల నుంచీ అక్కడ తనిఖీలు, నిఘాలూ కొనసాగుతున్నాయి. ఇది వరకు అమెరికా మాజీ అధ్యక్షులైన బరాక్ ఒబామా, జార్జి బుష్ వంటి వాళ్లు స్టే చేసిన అదే హోటల్‌లోని చాణక్య సూట్‌లోనే ఇప్పుడు ట్రంప్ కూడా ఉండబోతున్నారు. రెండు వారాలుగా ఢిల్లీ పోలీసులతోపాటూ... NSG కమాండోలు... ఆ హోటల్‌ను చుట్టుముట్టారు. ప్రతీ ఫ్లోర్‌ను రోజూ సర్వే చేస్తున్నారు. అమెరికా రాయబార కార్యాలయ అధికారులు కూడా అదే పనిగా దాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇకా చాలా విషయాలున్నా... అవేవీ బయటకు చెప్పట్లేదు.... సెక్యూరిటీ సమస్య వస్తుందని.

ఆ ఫైవ్ స్టార్‌ హోటల్‌లో 438 గదులు ఉంటాయి. ఎప్పుడూ వేర్వేరు దేశాల ప్రతినిధులు, సెలబ్రిటీలు, గెస్టులతో బిజీగా ఉంటుంది. ట్రంప్ ఫ్యామిలీతో సహా వస్తుండటంతో... హోటల్‌లోని 438 గదులనూ వారికోసం, వారితో వచ్చే అతిథుల కోసం బుక్ చేశారు. ఇప్పుడా హోటల్ దగ్గర సెక్యూరిటీ ప్రోటోకాల్ ఉంది. కాబట్టి... అటువైపుగా రాకపోకలు లేవు. అక్కడ గుంపులుగా ప్రజలు ఉంటే ఒప్పుకోరు. ప్రస్తుతం ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల ట్రంప్ ఇండియా పర్యటనలో భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడట్లేదు. ఉదాహరణకు ఆ హోటల్‌లో ఢిల్లీ పోలీసుల భద్రతతోపాటూ... అమెరికా సీక్రెట్ సర్వీస్, ఇతర ఏజెన్సీల సెక్యూరిటీ కూడా ఉంది. ట్రంప్ ఎక్కడెక్కడికి వెళ్తే... అక్కడ మూడంచెల భద్రత కల్పిస్తున్నారు.



ట్రంప్ వచ్చినప్పుడు... హోటల్‌లోని ప్రతీ ఫ్లోర్‌లోనూ ఢిల్లీ పోలీసులు పహారా కాస్తారు. కాకపోతే... వాళ్లు రెగ్యులర్ ఖాకీ డ్రెస్సుల్లో కాకుండా... ప్లెయిన్ క్లాత్స్‌లో కనిపిస్తారు. ఢిల్లీ పోలీసుల సెక్యూరిటీ వింగ్... ట్రంప్ ఉండే ఫ్లోర్‌లో ఇన్నర్ కార్డన్‌గా భద్రత కల్పిస్తారు. జనరల్‌గా ఈ సెక్యూరిటీ వింగ్... ఇలా విదేశాల నుంచీ వచ్చే అతిథులకు భద్రత కల్పిస్తూ ఉంటుంది. హోటల్‌లోనీ లాబీ ఏరియా, పార్కింగ్, లాన్ ఏరియా, పూల్ ఏరియాల్లో రెండో అంచె భద్రత కల్పిస్తారు. మూడో అంచె భద్రతను పోలీసులు, జిల్లా పోలీసులతో కల్పించబోతున్నారు. హోటల్ ఎదురుగా గ్రీన్ రిడ్జ్ ఏరియా ఉంటుంది. అక్కడ ఆ రోజు మొత్తం పోలీసులే కనిపిస్తారు. ITC మౌర్య హోటల్ పక్కన తాజ్ ప్యాలెస్ హోటల్ ఉంది. దానికి కూడా హైసెక్యూరిటీ కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఎవరు ఎక్కడ నిఘా పెట్టాలి అనేది ఇంకా పోలీసులకు ఫైనలైజ్ చెయ్యలేదు. కరెక్టుగా ట్రంప్ వచ్చే టైమ్‌లో మాత్రమే ఆ వివరాలు చెబుతారట.
First published: February 22, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు