CM KCR: నేడు టీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ కీలక భేటీ

సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)

కరోనా లాక్‌డౌన్ కేంద్రం ప్రభుత్వం అనురిస్తున్న తీరుపై ఎంపీలతో చర్చించి.. సభలో ఎలా వ్యవహరించాలన్న దానిపై దిశా నిర్దేశం చేయనున్నారు సీఎం కేసీఆర్.

 • Share this:
  టీఆర్ఎస్ లోక్‌సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ సమావేశం కానున్నారు. ప్రగతిభవన్‌లో ఈ భేటీ జరగనుంది. సెప్టెంబరు 14 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో.. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. కరోనా లాక్‌డౌన్ కేంద్రం ప్రభుత్వం అనురిస్తున్న తీరుపై ఎంపీలతో చర్చించి.. సభలో ఎలా వ్యవహరించాలన్న దానిపై దిశా నిర్దేశం చేయనున్నారు సీఎం కేసీఆర్. జీఎస్టీ విషయంలో కేంద్రం వైఖరి, కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సంస్కరణలతో పాటు ఇతర అంశాలపైనా చర్చించనున్నారు. జీఎస్టీ విషయంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై సీఎం కేసీఆర్, ఆర్థిక హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

  సెప్టెంబరు 1న సీఎం కేసీఆర్ స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. జీఎస్టీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారరం తగ్గించాలనే నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని కేసీఆర్ లేఖలో డిమాండ్ చేశారు. చట్ట ప్రకారం రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం మొత్తం చెల్లించాల్సిందేనని.. అవసరాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వమే రుణాలు తీసుకొని రాష్ట్రాలకు పూర్తిగా పరిహారం చెల్లించాలని కోరారు. 14 శాతం వృద్ధి రేటు ఆధారంగా రాష్ట్రాలకు ఆదాయం తగ్గితే, చట్ట ప్రకారం కేంద్రమే దాన్ని భర్తీ చేయాలని స్పష్టం చేశారు. అటు విద్యుత్ సంస్కరణలను కూడా కేసీఆర్ తప్పుబట్టుతున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి పార్లమెంట్ సమావేశాలు కీలకంగా మారనున్నాయి.

  కాగా, సెప్టెంబర్‌ 14 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు అక్టోబర్‌ 1 వరకు జరుగుతాయి. సమావేశాలు తొలిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు లోక్‌సభ జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 వరకు రాజ్యసభ జరుగుతుంది. మిగతా రోజుల్లో ఉదయం వేళ రాజ్యసభ, మధ్యాహ్నం వేళ లోక్‌సభ సమావేశాలను నిర్వహిస్తారు. ఉభయ సభల్లోనూ ప్రశ్నోత్తరాలను చైర్మన్‌, స్పీకర్‌ రద్దు చేశారు. కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో సభ్యులు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. ఎంపీలందరికీ పరీక్షలు చేసి కోవిడ్ నెగెటివ్ ఉన్న వారిని, కరోనా లక్షణాలు లేని సభ్యులను మాత్రమే లోపలికి అనుమతిస్తారు.
  Published by:Shiva Kumar Addula
  First published: