నేడు ఆర్టీసీ కార్మికులతో కేసీఆర్ సమావేశం, ఆర్టీసీపై చర్చ

Telangana : ఆర్టీసీ కార్మికుల్ని తిరిగి విధుల్లోకి తీసుకున్న సీఎం కేసీఆర్... వారి సమస్యల్ని తనదైన శైలిలో చర్చించేందుకు ఇవాళ ముహూర్తం పెట్టుకున్నారు. మొత్తం 750 మందితో చర్చించనున్నారు.

news18-telugu
Updated: December 1, 2019, 5:33 AM IST
నేడు ఆర్టీసీ కార్మికులతో కేసీఆర్ సమావేశం, ఆర్టీసీపై చర్చ
సీఎం కేసీఆర్
  • Share this:
Telangana : తెలంగాణలో తనకు ఎదురు తిరిగితే ప్రమాదమేనని మరోసారి నిరూపించుకున్నారు సీఎం కేసీఆర్. ఎలాంటి షరతులూ లేకుండా ఆర్టీసీ కార్మికులు తిరిగి విధుల్లోకి చేరడంతో... ఇప్పుడు కేసీఆర్ కాస్త మెత్తబడ్డారు. వాళ్ల సమస్యలేంటో తెలుసుకునేందుకు ఇవాళ ఆత్మీయ సమావేశం నిర్వహించాలని డిసైడయ్యారు. ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం ఒంటి గంటకు ఇది జరగనుంది. ఒక్కో డిపో నుంచి ఇద్దరు మహిళా ఉద్యోగులు సహా ఐదుగురు చొప్పున 97 డిపోల నుంచి దాదాపు 750 మంది ఉద్యోగులు, కార్మికులు ఈ సమావేశానికి వస్తున్నారు. ముందుగా సీఎం కేసీఆర్... ఉద్యోగులు, కార్మికులతో కలిసి భోజనం చేస్తారు. ఆ తర్వాత ఆర్టీసీ పరిస్థితేంటి? లాభనష్టాలు, ప్రభుత్వం ఏం చెయ్యాలనుకుంటోంది? ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ ఎలా ఉండేది? ఇప్పుడెలా ఉంది? వంటి విషయాల్ని కేసీఆర్ వివరిస్తారని తెలిసింది. కార్మికులు, ఉద్యోగుల వైపు నుంచి కూడా ఫీడ్‌బ్యాక్ తీసుకోనున్నారు. సంస్థను లాభాల్లో నడిపించేందుకు ఆర్టీసీ ఉద్యోగులు ఏం చెయ్యాలనుకుంటున్నారో తెలుసుకోబోతున్నట్లు తెలిసింది.

ఇన్నాళ్లూ సమ్మె కారణంగా సీఎం ఆగ్రహాన్ని చూసిన ఉద్యోగులు... ఇప్పుడు అదే సీఎం భోజనానికీ, ఆత్మీయ సమావేశానికీ పిలవడంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ఒకింత ఊరటగా ఫీలవుతున్నారు. తమ డిమాండ్లేవీ నెరవేరకపోయినా, ఇవాళ సీఎం వరాలేమైనా ప్రకటిస్తారేమోనని ఆశగా చూస్తున్నారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవడమే పెద్ద వరంగా భావిస్తున్నామని చాలా మంది అంటున్నారు. సంస్థ వాస్తవ పరిస్థితుల్ని సీఎం కేసీఆర్‌కి వివరించేందుకు ఈ మీటింగ్ బాగా ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు.

 

90ml బ్యూటీ నేహా సోలంకి క్యూట్ ఫొటోస్


ఇవి కూడా చదవండి :

Health Tips : పొట్ట తగ్గాలా... చెరుకు రసాన్ని ఇలా తాగితే సరి...Health Tips : బరువు తగ్గాలా... అల్లంతో ఇలా చెయ్యండి

Health Tips : టీ కంటే డికాక్షన్ బెటర్... మెదడుకు చురుకుదనం

Healthy Food : పాలకూర దోఖ్లా... తింటే ఎంతో ఆరోగ్యం

Aloe Vera : ప్రకృతి నుంచీ లభించే అద్భుతం... అలోవెరాతో ఆరోగ్య ప్రయోజనాలు
First published: December 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>