Home /News /telangana /

నేడు కల్నల్ సంతోష్ ఇంటికి సీఎం కేసీఆర్.. వీరుడి కుటుంబానికి అండగా..

నేడు కల్నల్ సంతోష్ ఇంటికి సీఎం కేసీఆర్.. వీరుడి కుటుంబానికి అండగా..

కల్నల్ సంతోష్, సీఎం కేసీఆర్

కల్నల్ సంతోష్, సీఎం కేసీఆర్

గాల్వాన్ ఘర్షణలో మరణించిన మిగతా 19 మంది కుటుంబ సభ్యులకు కూడా ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం తరుఫున కేంద్ర రక్షణ మంత్రి ద్వారా అందిస్తామని సిఎం వెల్లడించారు.

    తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు సూర్యాపేటకు వెళ్లనున్నారు. అమర జవాన్ కల్నల్ సంతోష్ బాబు కుటుంబ సభ్యులను ఆయన పరామర్శిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.5 కోట్ల సాయాన్ని చెక్కు రూపంలో అందించనున్నారు తెలంగాణ సీఎం. నిన్న ఉదయం కల్నల్ సంతోష్ బాబు ఇంటికి వెళ్లిన మంత్రి జగదీష్ రెడ్డి ఈ విషయాన్ని వారికి చెప్పారు. ఇది ప్రభుత్వ సాయం కాదని.. దేశ కోసం ప్రాణత్యాగం చేసిన జవాన్‌కు ఇస్తున్న గౌరవమని తెలిపారు. గాల్వాన్ లోయ ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం కేసీఆర్ ఇది వరకే చెప్పారు. సంతోష్ బాబు కుటుంబానికి రూ.5 కోట్ల నగదు, హైదరాబాద్‌లో 800 చ.గజాల నివాస స్థలం, ఆయన భార్యకు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఉద్యోగానికి సంబంధించిన అపాయింట్‌మెంట్ లెటర్‌ను కేసీఆర్ ఇవాళ సంతోష్ భార్య సంతోషికి ఇవ్వనున్నారు.

    ఇదే ఘర్షణలో మరణించిన మిగతా 19 మంది కుటుంబ సభ్యులకు కూడా ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం తరుఫున కేంద్ర రక్షణ మంత్రి ద్వారా అందిస్తామని సిఎం వెల్లడించారు. కాగా, జూన్ 15, 16 తేదీల్లో గల్వాన్ లోయలో భారత్, చైనా జవాన్ల మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఘటనలో కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. చైనాకు చెందిన 43 మంది సైనికులు మరణించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఐతే చైనా మాత్రం అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
    First published:

    Tags: CM KCR, Coronavirus, Covid-19, Suryapet, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు