సీఎం కేసీఆర్ పుట్టిన రోజును అలా సెలబ్రేట్ చేసుకోండి..కేటీఆర్ పిలుపు

CM KCR Birthday Celebrations: తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 17న తన 66వ పుట్టిన రోజును జరుపుకోనున్నారు. ఆయన పుట్టిన రోజును ఘనంగా జరుపుకునేందుకు ఆ పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నారు.

news18-telugu
Updated: February 10, 2020, 3:38 PM IST
సీఎం కేసీఆర్ పుట్టిన రోజును అలా సెలబ్రేట్ చేసుకోండి..కేటీఆర్ పిలుపు
కేసీఆర్‌తో కేటీఆర్(ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఈ నెల 17న 66వ వడిలో అడుగుపెట్టనున్నారు. కేసీఆర్ పుట్టిన రోజును ఘనంగా జరుపుకునేందుకు టీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.  ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులకు సామాజిక సందేశంతో కూడిన పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్. ‘హరిత హారం’ కార్యక్రమం అంటే కేసీఆర్‌కు చాలా ఇష్టమని కేటీఆర్ గుర్తు చేశారు. ఆ రోజున కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ఆయన పుట్టిన రోజున సెలబ్రేట్ చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఒక్క మొక్కైనా నాటాలని పిలుపునిచ్చారు.

కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా తప్పనిసరిగా మొక్కలు నాటుతామని టీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నారు. కేటీఆర్ సామాజిక స్పృహతో ఇచ్చిన పిలుపుపట్ల నెటిజన్లు అభినందనలు చెబుతున్నారు. చాలా మంచి ఆలోచన అంటూ అభినందనలు తెలిపారు.
First published: February 10, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు