Yadadri: రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్.. ఆ తేదీల ప్రకటన.. భక్తుల నిరీక్షణకు ముగింపు !

సీఎం కేసీఆర్, యాదాద్రి ఆలయం (ఫైల్ ఫోటో)

CM KCR-Yadadri: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయమైన యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా పునర్ నిర్మించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. ఇందుకోసం 2016లో పనులను ప్రారంభించారు.

 • Share this:
  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు యాదాద్రికి వెళ్లనున్నారు. ఆలయ పునర్ నిర్మాణ పనులను పర్యవేక్షించనున్న సీఎం కేసీఆర్.. పున: ప్రారంభం సందర్భంగా నిర్వహించనున్న మహా సుదర్శన యాగం వివరాలను, తేదీలను ప్రకటించనున్నారు. హైద‌రాబాద్ నుంచి ఉద‌యం 11:30 గంట‌ల‌కు యాదాద్రి (Yadadri) బ‌య‌లుదేరనున్నారు. యాదాద్రిలో పునర్ నిర్మించిన ఆలయం ప్రారంభం తేదీ ముహూర్తాన్ని ఇప్పటికే చినజీయర్ స్వామి (ChinaJeeyar)నిర్ణయించారు. ఇదే అంశంపై ఇటీవల సీఎం కేసీఆర్ (CM KCR) ఆయనను స్వయంగా కలిసి చర్చించారు. ఈ నేప‌థ్యంలో యాదాద్రిలోనే ఆలయ పున: ప్రారంభం తేదీలను కేసీఆర్ స్వయంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.

  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయమైన యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా పునర్ నిర్మించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. ఇందుకోసం 2016లో పనులను ప్రారంభించారు. ఐదేళ్ల పాటు సాగిన ఆలయ పునర్ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. ప్రధాన ఆలయం పనులు పూర్తి కావడంతో... లక్ష్మీ నరసింహస్వామి మూల విరాట్ కొలువైన ప్రధాన ఆలయాన్ని ఎప్పుడు దర్శించుకుంటామా ? అని భక్తులు ఎదురుచూస్తున్నారు. ఆలయ పున: ప్రారంభానికి ముందే పెద్ద ఎత్తున మహా సుదర్శన యాగం నిర్వహించాలని సంకల్పించిన సీఎం కేసీఆర్.. చినజీయర్ స్వామి సూచనల మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఇప్పటికే ఆదేశించారు.

  సీఎం కేసీఆర్ రేపు యాదాద్రి ఆలయం పున: ప్రారంభం తేదీని ప్రకటిస్తే.. యాదాద్రిలో అభివృద్ధి పనులు మరింత వేగం పుంజుకోనున్నాయని తెలుస్తోంది. యాదాద్రిలో ఇప్పటికే రోడ్ల వెడల్పు పనులతో పాటు పుష్కరిణి, వ్రత మండపం పనుల నిర్మాణం వేగంగా సాగుతోంది. రేపు ఆ పనులను కూడా సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు.

  Maa Elections 2021: మా ఎన్నికల ఎఫెక్ట్.. ఆ నినాదం ప్రభావం తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఉంటుందా ?

  YS Jagan: జగన్‌ను టెన్షన్ పెడుతున్న వైఎస్ఆర్ సన్నిహితుడు.. వైసీపీలో టెన్షన్

  యాదాద్రి ఆలయం పున: ప్రారంభ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీని ఆహ్వానించారు సీఎం కేసీఆర్. ఆయన కూడా ఇందుకు సానుకూలంగా స్పందించారు. ప్రధానితో పాటు అనేకమంది ప్రముఖులు ఈ వేడుకకు హాజరవుతారని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అందుకే యాదాద్రిలో పెండింగ్‌ పనులు సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని యోచిస్తోంది.
  Published by:Kishore Akkaladevi
  First published: