హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ వెనక్కి తగ్గారా.. పరిష్కారం దిశగా...

ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ వెనక్కి తగ్గారా.. పరిష్కారం దిశగా...

TSRTC Strike | ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ వెనక్కి తగ్గారా? కార్మికుల ఆత్మహత్య ఒత్తిడితో పట్టు విడవాలని నిర్ణయించుకున్నారా? ప్రజల్లో అసహనం రాకుండా చూసేందుకు జాగ్రత్త పడుతున్నారా? అంటే.. తాజా పరిణామాలు అవుననే సమాధానమిస్తున్నాయి.

  ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ వెనక్కి తగ్గారా? కార్మికుల ఆత్మహత్య ఒత్తిడితో పట్టు విడవాలని నిర్ణయించుకున్నారా? ప్రజల్లో అసహనం రాకుండా చూసేందుకు జాగ్రత్త పడుతున్నారా? అంటే.. తాజా పరిణామాలు అవుననే సమాధానమిస్తున్నాయి. అందుకే తాను స్వయంగా రంగంలోకి దిగకుండా.. పార్టీ సీనియర్ నేత కే.కేశవరావును ముందుకు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి.. దసరా వేళ సమ్మె చేపట్టిన కార్మికులపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మెలో పాల్గొన్న కార్మికులు తమ ఉద్యోగం కోల్పోయారని, నోటిఫికేషన్ జారీ చేసి.. కొత్తవారిని విధుల్లోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. అన్నట్లుగానే తాత్కాలిక సిబ్బందిని విధుల్లోకి తీసుకొని, బస్సులను నడిపారు. అయితే.. ప్రైవేటు వెహికల్స్, తాత్కాలిక సిబ్బంది.. ప్రయాణికుల నుంచి అందినకాడికి దోచుకున్నారు. జేబులు గుల్ల చేస్తూ టికెట్‌ రేటుకు డబుల్, ట్రిపుల్ వసూలు చేశారు. అయినా.. భరించి ప్రయాణికులు స్వస్థలాలకు, ఆ తర్వాత హైదరాబాద్‌కు చేరుకున్నారు. దసరా సెలవులు పూర్తయ్యి స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం కావాల్సిన తరుణంలో సమ్మె ప్రభావం ఉండటంతో విద్యార్థులకు సెలవులు పొడిగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

  అదే, ప్రజల్లో అసహనానికి కారణమైంది. ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వం వల్ల విద్యార్థుల భవిష్యత్తు పాడవుతోందని.. ఆవేదన వ్యక్తం చేశారు తల్లిదండ్రులు. అదే సమయంలో ఆర్టీసీ కార్మికులు కొందరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమ జీవితాలు అగమ్యగోచరంగా తయారయ్యాయంటూ కొందరు దిగులుతో గుండెపోటుకు గురై చనిపోయారు. మరికొందరు మంచానపడ్డారు. దీంతో.. తీగను మరింత లాగితే తెగిపోతుందని సీఎం జాగ్రత్త పడ్డట్లు తెలుస్తోంది.

  అయితే, తాను స్వయంగా రంగంలోకి దిగితే కార్మికులు మరింతగా పట్టు పట్టే అవకాశం ఉందని గ్రహించి, పార్టీ సీనియర్ నేత కే.కేశవరావును రంగంలోకి దించారు. కార్మికులు, ప్రభుత్వం చర్చలు జరిపి పరిష్కార మార్గం దిశగా సాగాలని కేకే చెప్పినా, దాని వెనక సీఎం కేసీఆర్ ఉన్నారని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఢిల్లీలో ఉన్న కేకే.. హుటాహుటిన హైదరాబాద్ రావాలని ఆయన ఆదేశించడం కూడా సమ్మెను ఎలాగైనా విరమింపజేయాలన్న సంకల్పం ఉన్నట్లు అవగతం అవుతోందని చెబుతున్నారు.

  అంతేకాకుండా, ఖమ్మం డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యపై మంత్రి పువ్వాడ పత్రిక ప్రకటన చేయడం వెనక కూడా సీఎం ఉన్నట్లు తాజా పరిణామాల వల్ల తెలుస్తోంది. ప్రజలకు మరిని ఇబ్బందులు ఎదురుకావొద్దని నిర్ణయానికి వచ్చిన సీఎం.. ఈ మేరకు తానే ఓ మెట్టు దిగారని విశ్లేషకులు చెబుతున్నారు. కేకే మధ్యవర్తిత్వం ద్వారా ప్రభుత్వంతో కార్మికులు చర్చలు జరిపేలా చేసి, సమ్మెను విరమింపజేసే ఉద్దేశంలో సీఎం ఉన్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే.. ఆర్టీసీ జేఏసీ కూడా కేకే మధ్యవర్తిత్వానికి ఓకే చెప్పడం వల్ల సీఎం కొంతవరకు విజయం సాధించినట్లే అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా.. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి, బస్సులను నడిపితేనే ప్రయాణికుల ఇక్కట్లు సమసే అవకాశం ఉంది.

  First published:

  Tags: CM KCR, Rtc jac, Tsrtc, TSRTC Strike

  ఉత్తమ కథలు