కొంచపోచమ్మ ప్రాజెక్ట్‌ను దగ్గర సీఎం కేసీఆర్ ఆకస్మిక పర్యటన

సీఎం కేసీఆర్

కొండపోచమ్మ సాగర్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఏమైనా లోపాలు ఉన్నాయా అని అధికారులను, స్థానికులను సీఎం కేసీఆర్‌ అడిగి తెలుసుకున్నారు.

  • Share this:
    తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు కొండపోచమ్మ సాగర్ జలాశయాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. అధికారులకు, మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సీఎం కేసీఆర్ ప్రాజెక్ట్‌ వద్దకు చేరుకున్నారు. ప్రాజెక్ట్ వద్దకు సీఎం కేసీఆర్ రావడాన్ని గమనించిన అధికారులు... ఉరుకులు పరుగుల మీద కొండపోచమ్మ ప్రాజెక్ట్‌ వద్దకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్‌ను కలవడానికి, చూడటానికి భారీగా తరలివచ్చారు. దాదాపు 45 నిమిషాల పాటు ప్రాజెక్ట్‌ పరిసర ప్రాంతాలను పరిశీలించిన సీఎం కేసీఆర్‌ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

    కొండపోచమ్మ సాగర్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఏమైనా లోపాలు ఉన్నాయా అని అధికారులను, స్థానికులను సీఎం కేసీఆర్‌ అడిగి తెలుసుకున్నారు. కొండపోచమ్మ కుడి, ఎడమ కాలువల పనులు వేగవంతం చేయాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. కొండపోచమ్మ దిగువన ఉన్న రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అక్కడి రైతులను కేసీఆర్‌ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం సాగర్‌ నిర్మాణంలో జరుగుతున్న పనులపై అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు. సాగర్‌నుంచి మల్లన్న సాగర్‌ కాలువ పనుల గురించి అధికారులను సీఎం కేసీఆర్ ఆరా తీశారు. అదేవిధంగా సాగర్‌లో స్నానానికి ఎట్టిపరిస్థితుల్లో అనుమతిని ఇవ్వొద్దని అధికారులను హెచ్చరించారు.


    Published by:Kishore Akkaladevi
    First published: