హోమ్ /వార్తలు /తెలంగాణ /

CM kcr Mahadhrana : ఇందిరాపార్క్ మహాధర్నాలో సీఎం కేసీఆర్.. ఇది ఆరంభం మాత్రమే..

CM kcr Mahadhrana : ఇందిరాపార్క్ మహాధర్నాలో సీఎం కేసీఆర్.. ఇది ఆరంభం మాత్రమే..

ఇదిరాపార్క్ ధర్నాలో సీఎం కేసీఆర్

ఇదిరాపార్క్ ధర్నాలో సీఎం కేసీఆర్

CM kcr Mahadhrana : కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని మహాధర్న చేపట్టిన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసిఆర్ ఇందిరాపార్క్‌కు చేరుకుని ధర్నాలో పాల్గోన్నారు..ధర్నాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇంకా చదవండి ...

వరి ధాన్యం కోనుకోలుపై కేంద్ర వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ చేపట్టిన మహాధర్నా కార్యక్రమం ఇందిరాపార్క్ వద్ద కోనసాగుతోంది. మహాధర్నాలో సీఎం కేసిఆర్ వెంట మంత్రులు, ఎంపీలు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో పాటు వారికి మద్దతుగా పార్టీ కార్యకర్తలు పాల్గోన్నారు. కాగా సీఎం అయిన తర్వాత కేసిఆర్ మొదటి సారిగా కేంద్రానికి వ్యతిరేకంగా ధర్నాలో పాల్గోన్నారు. ధర్నా మధ్యహ్నాం రెండు గంటల వరకు కొనసాగనుంది.

ధర్నాలో పాల్గోన్న సీఎం కేసిఆర్ మాట్లాడూతూ..ఇది అంతం కాదని, ఆరంభం మాత్రమేనని అన్నారు. రైతులకు మద్దతుగా దేశంలోని ఇతర పార్టీలను కలుపుకుని రైతుల గోడును తెలిపేందుకు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. పంజాబ్‌లో ఎలాగైతే ధాన్యం కొనుగోలు చేస్తున్నారో.. తెలంగాణలో కూడా అదే పద్దతిలో కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.. ఇందుకోసం గతంలోనే రాష్ట్ర వ్వవసాయ మంత్రి నిరంజన్‌ రెడ్డితోపాటు పాటు , తాను కూడా ఢిల్లీ వెళ్లి వినతి పత్రం ఇచ్చి, 50 రోజులు గడుస్తున్నా... ఇప్పటి వరకు కేంద్రం నుండి ఎలాంటీ స్పందన రాలేదని అన్నారు. అయినా నిన్న మరోసారి తాను లేఖ కూడా రాశానని చెప్పారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం దిగి వచ్చేవరకు తమ పోరు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.


ఇది చదవండి  : పేరుకే కోటి రూపాయలా..? విజేతకు దక్కేది ఎంత ? మిగతా డబ్బు ఎక్కడికి వెళుతోంది..?

కేంద్రం దిగివచ్చే వరకు అవసరమైతే ఢిల్లీ వరకు పోరాటం తీసుకోవాల్సిన పరిస్థతి ఉంటుందని ఆయన అన్నారు.. ఇక అధికారంలో ఉన్న వారే ధర్నాలు చేపడితే.. ఎట్లా అని ప్రశ్నిస్తున్న వారికి ఆయన సమాధానం చెప్పారు.. దేశంలో సీఎంలు, ఎమ్మెల్యేలు కేంద్రానికి వ్యతిరేకంగా ధర్నాకు దిగే విదంగా తీసుకువచ్చిన పరిస్థితులను కేంద్రమే కల్పించిందని అన్నారు.. కేంద్రం రాష్ట్రాల హక్కులతో పాటు సమస్యను పరిష్కరించకపోవడం వల్లే ధర్నా చేపట్టాల్సి వస్తుందని ఆయన వివరించారు. దీినీ ద్వారా కేంద్రం వైఖరి ని ప్రపంచానికి తెలియనుందని చెప్పారు.. మరోవైపు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ఏకంగా 51 గంటల పాటు అప్పటి కేంద్రానికి వ్యతిరేకంగా ధర్నాల చేపట్టారని ఆయన అన్నారు.  ఇలాంటీ ప్రదాని రాష్ట్రాలలో తిరిగి ఆ పరిస్థితులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయనదే అని వ్యాఖ్యానించారు.

First published:

Tags: CM KCR, Indirapark, Telangana

ఉత్తమ కథలు