Home /News /telangana /

TELANGANA CM KCR SLAMS PM NARENDRA MODI JUST BEFORE HIS ARRIVAL TO HYDERABAD TO PARTICIPATE IN BJP NATIONAL EXECUTIVE MEETING SK

CM KCR: దేశం పరువు తీస్తున్నారు.. ప్రధాని మోదీపై నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

CM KCR slams PM Narendra Modi: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా (Yashwant Sinha) హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా ఆయనకు టీఆర్ఎస్ ఘన స్వాగతం పలికింది. అనంతరం జల విహార్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన సీఎం కేసీఆర్.. మోదీపై తీవ్ర విమర్శలు చేశారు.

ఇంకా చదవండి ...
  ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) హైదరాబాద్ పర్యటన వేళ..ఆయనపై తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR) నిప్పులు చెరిగారు. అన్ని రంగాలూ నష్టపోయాయని.. అంతర్జాతీయ సమాజం ముందు దేశం పరువు మొత్తం తీస్తున్నారని ధ్వజమెత్తారు ఆయన ప్రధానిగా వ్యవహరిచడం లేదని.. సేల్స్‌మ్యాన్‌లా మారారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ పాలనలో దేశం సర్వనాశనం అయిందని విరుచుకుపడ్డారు. రైతులు, సైనికులు, యువత, ఉద్యోగులు... బీజేపీ హయాంలో ఎవరూ సంతోషంగా లేరని తీవ్ర విమర్శలు చేశారు సీఎం కేసీఆర్. తాము చూస్తూ ఊరుకోబోమని.. ఖచ్చితంగా పోారాడుతామని స్పష్టం చేశారు. దేశంలో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందని.. ఖచ్చితంగా వస్తుందన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ సీఎం. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా (Yashwant Sinha) హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా ఆయనకు టీఆర్ఎస్ ఘన స్వాగతం పలికింది. అనంతరం జల విహార్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన సీఎం కేసీఆర్.. మోదీపై తీవ్ర విమర్శలు చేశారు.

  కేసీఆర్ ప్రసంగంలో ముఖ్యాంశాలు:

  యశ్వంత్ సిన్హా గతంలో ఆర్థికమంత్రి, విదేశాంగమంత్రిగా పనిచేశారు.  రాష్ట్రపతి ఎన్నికల్లో ఒక మంచి వ్యక్తికి మద్దతు ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది.  ఇద్దరినీ చూడంది. మీ ఆత్మసాక్షి ప్రకారం ఓటు వేయండి. యశ్వంత్ సిన్హాకు ఓటువేయాలని దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలను కోరుతున్నా. యశ్వంత్ సిన్హా గెలుస్తారని భావిస్తున్నా. ఆయన గెలిస్తే దేశ గౌరవం పెరుగుతుంది.

  ప్రస్తుతం దేశంలో పరిస్థితులు బాగాలేదు. బీజేపీ పాలనలో దేశం సర్వనాశనమయింది. దీనిపై గళమెత్తాలి. భారత రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలి. ఆ అవసరం ఎంతో ఉంది. ఖచ్చితంగా వస్తుందన్న నమ్మకముంది.

  స్పైస్‌ జెట్ విమానంలో వ్యాపించిన పొగలు.. 5 వేల అడుగుల ఎత్తులో ఉండగా ఘటన..

  ఇవాళ ప్రధాని మోదీ హైదరాబాద్‌కు వస్తున్నారు. రెండు రోజులు ఇక్కడ ఉంటారు. గొంతు చించుకొని మా గురించి వ్యతిరేకంగా మాట్లాడతారు. నో ప్రాబ్లమ్. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడికైనా రావచ్చు. ఆరోపణలు చేయవచ్చు. ప్రసంగాలు కాదు.. ముందు మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి.

  మొదటి సారి ప్రధాని అయినప్పుడు.. ఏన్నో హామీలు చేశారు. అందులో ఒక్క హామీనైనా నెరవేర్చారా? ఒక్కటైనా పూర్తి చేస్తే.. దాని గురించి వివరించాలి. టార్చ్‌లైట్ వేసి వెతికినా.. మీరు పూర్తి చేసిన పని ఒక్కటి కూడా ఉండదు.

  రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు. కానీ.. ఖర్చులు రెట్టింపు చేశారు. పెట్రోల్, డీజిల్, ఎరువులు, విద్యుత్.. అన్ని ధరలను పెంచారు. మీ చట్టాలను వ్యతిరేకిస్తూ... 9 నెలలు రైతులు ఆందోళనలు చేశారు. వారిని ఉగ్రవాదులు అన్నారు. ఖలీస్తానీ అన్నారు. ఆందోళనకారులపై కారు తోలించి..హత్య చేశారు. ఆందోళన చేసిన రైతుల్లో 700 మంది మరణించారు.

  ఎన్నికల ముందు తీపి తీపి మాటలు మాట్లాడతారు. ఎన్నికలయ్యాక మోసం చేస్తారు. మీరు తెచ్చిన వ్యవసాయం చట్టాలు మంచివే అయితే.. ఎందుకు రద్దు చేశారు. రైతులు మద్దతు ధరను, గౌరవప్రదమైన జీవితాన్ని కోరుకుంటున్నారు. ఇంకేమీ వారు అడగడం లేదు.  మీ ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇది దేశానికి ప్రమాదం. దేశంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఇక్కడ ఎవరూ శాశ్వతం కాదు. దేశంలో ప్రజాస్వామ్యం ఉంది. ఎవరైనా తాత్కాలికమే.

  రైతులు సంతోషంగా లేరు. సైనికులు, ఉద్యోగులు, యువత సంతోషంగా లేరు. ఆర్థిక మాంద్యం పెరుగుతుంది. వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారు. మీకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే.. వారిని వేధిస్తారు.

  ఇప్పుటి వరకు మీరు 9 ప్రభుత్వాలను కూలగొట్టారు. మీ హయాంలో దేశ గౌరవ మర్యాదాలు దారుణంగా పడిపోయాయి. ఇంకెప్పుడూ ఇలా జరగలేదు. ఇలాంటి నీతిమాలిన రాజకీయాలు చేస్తారా?

  Army-Police Fighting : పోలీసులు-జవాన్ల మధ్య ఫైటింగ్..రోడ్డుపై హైడ్రామా

  `ప్రధాన మంత్రిపై శ్రీలంక ఎలక్ట్రిసిటీ బోర్డు చేసిన ఆరోపణలపై ఎందుకు స్పందించరు. మోదీ చేసిన ఒత్తిడితోనే భారతీయ సంస్థకు సోలార్ కాంట్రాక్ట్ అప్పజెప్పినట్లు చెప్పారు. దీని గురించి ఎవరూ ఎందుకు నోరు మెదపరేంటి? గతంలో ఏ ప్రధానిపై ఇలాంటి ఆరోపణ రాలేదు.

  మీ పాలనలో దేశం తలదించుకోవాల్సి వస్తోంది. దీని గురించి మీరు మాట్లాడకపోతే దోషిగా పరిగణిస్తాం. మోదీ అంటే నాకు వ్యక్తిగత ద్వేషం లేదు. కానీ శ్రీలంక అంశంపై హైదరాబాద్ వేదికగా దేశ ప్రజలకు సమాధానం చెప్పండి.

  భారత్‌లో లభ్యమయ్యే బొగ్గు టన్నుకు 4వేలకే లభిస్తుంది. కానీ నరేంద్ర మోదీ విదేశాల నుంచి టన్నుకు 20, 30వేల చొప్పున కొంటున్నారు. మీరు దేశ ప్రధానిగా వ్యవహరించడం లేదు.. మీ మిత్రులుగా ఉన్న వ్యాపారవేత్తల కోసం సేల్స్‌మెన్‌గా వ్యవహరిస్తున్నారు.

  అభిమానం అంటే ఇది.. రాహుల్ గాంధీని వృద్ధురాలు ప్రేమతో దగ్గరకు తీసుకుని.. వీడియో వైరల్..

  నల్లధనాన్ని వెనక్కి తెస్తున్నా అన్నారు. తెచ్చారా? తెస్తే ఎక్కడుందో చెప్పాలి. నల్లధనం తగ్గలేదు. డబుల్ అయింది. మోదీ హయంలో స్విస్ బ్యాంకుల్లో అకౌంట్లు పెరిగాయి. ఇవి ఆరోపణలు కాదు. మా వద్ద రిపోర్టులు ఉన్నాయి. దేశప్రజలందరికీ ఈ విషయం తెలుసు.

  చైనాను చూడండి. మాటలు తక్కువ. పని ఎక్కువ. మనవి మాటలు ఎక్కువ.. పనులు తక్కువ. చైనా ఎకానమీ  16 ట్రిలియన్లకు పెరిగింది.  మన ఇంకా 3 ట్రిలియన్ల దగ్గరే ఉన్నాం. ఇన్ని వనరులు,  పనిచేసే  యువత ఉన్నా.. వెనకబడిపోయాం.

  కరోనా కట్టడిలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయింది. గంగా నదిని మనం ఎంతో పవిత్రంగా భావిస్తాం. కానీ అలాంటి నదిలో కరోనా సమయంలో శవాలు కొట్టుకొచ్చాయి. జనాలు పెద్ద ఎత్తున మరణించారు. రాత్రికి రాత్రి లాక్‌డౌన్ ప్రకటిస్తే..ఎంతో మంది పట్టాల వెంట నడుచుకుంటూ వెళ్లి.. చనిపోయారు.

  మహారాష్ట్ర తరహాలో తెలంగాణాలో ప్రభుత్వాన్ని కూలుస్తాం అంటున్నారు స్థానిక బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు. రండి కూల్చండి. అప్పుడు మేము మరింత స్వచ్ఛగా కేంద్రంలో మిమ్మల్ని మట్టుబెడతాం.

  రూపాయి విలువ పడిపోయింది. అన్ని అంతర్జాతీయ ప్రమాణాల ఇండెక్స్ లో భారత్ వెనకబడిపోయింది.  దేశంలో నిరుద్యోగం పెచ్చుమీరింది. ప్రజాస్వామ్యాన్ని రోజూ చంపేస్తున్నారు. సమాఖ్య స్ఫూర్తిని హత్య చేస్తున్నారు.

  భారత ఔన్నత్యాన్ని ప్రధాని మోదీ దిగజార్చారు. దేశ ప్రజలందరికీ క్షమాపణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి నియంత, వికృత పాలనకు చరమ గీతం పాడాల్సిన అవసరంఉంది.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: CM KCR, PM Narendra Modi, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు