హోమ్ /వార్తలు /తెలంగాణ /

CM KCR: ప్రభుత్వాన్ని కూల్చుతారట.. ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

CM KCR: ప్రభుత్వాన్ని కూల్చుతారట.. ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్, మోదీ (ఫైల్ ఫొటోలు)

కేసీఆర్, మోదీ (ఫైల్ ఫొటోలు)

Telangana CM KCR: తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని స్వయంగా ప్రధాని మోదీయే అన్నారని కేసీఆర్ ఆరోపించారు. ప్రశ్నించిన ప్రభుత్వాన్ని కూల్చేయడమే.. మోదీ విధానామా? అని విరుచుకుపడ్డారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Mahbubnagar (Mahabubnagar)

గత కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్న సీఎం కేసీఆర్ (CM KCR).. తాజాగా మరోసారి టార్గెట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మహబూబ్ నగర్‌(Mahbubnagar)లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. అనంతరం ఎంవీఎస్ కాలేజీలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ (Telangana) ప్రభుత్వ పథకాలను, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని స్వయంగా ప్రధాని మోదీయే (PM Narendra Modi) అన్నారని కేసీఆర్ ఆరోపించారు. ప్రశ్నించిన ప్రభుత్వాన్ని కూల్చేయడమే.. మోదీ విధానామా? అని విరుచుకుపడ్డారు.

'' తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం సహకరించడం లేదు. మోదీ విధానాల వల్ల రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది.  కేంద్ర ప్రభుత్వం సహకరించి ఉంటే రాష్ట్ర జీఎస్డీపీ మరింత పెరిగేది.  కృష్ణా జలాల్లో వాటా తేల్చడం లేదు. 8 ఏళ్ల కాలం సరిపోలేదా? దేశంలో ఏం జరుగుతుందో ప్రజల్లో చర్చ జరగాలి.  మేధావులు, యువత ఆలోచించాలి. ప్రజలు ఓట్లేసి గెలిపించిన ప్రభుత్వానికి ఆటంకాలు సృష్టిస్తున్నారు. రాష్ట్రానికి బీజేపీ నేతలు ఏమీ చేయరు. చేసే వారి కాళ్లలో కట్టెలు పెడతారు. ఇదేంటని ప్రశ్నిస్తే..  కేసీఆర్ నీ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని మోదీ అన్నారు. ఇదే ఆయన విధానమా? పశ్చిమ బెంగాల్‌కు చెందిన 40 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని మోదీ అన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమే బీజేపీ విధానమా? ఎమ్మెల్యేలను కొని.. తెలంగాణ సర్కార్‌కు కూల్చేందుకు కొందరు దొంగలు వస్తే.. వారిని పట్టుకొని జైల్లో వేశాం.'' అని సీఎం కేసీఆర్ అన్నారు.

కేంద్ర విధానాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు తెలంగాణ సీఎం. అర్ధమైనా గానీ అర్థం కానట్లు ఉంటే.. అందరి బతుకులు ఆగమైతాయని అన్నారు. బీజేపీ నేతలు.. ఉన్మాదం, విద్వేషాలు, భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారుని ఆయన విమర్శించారు. ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెడుతున్నారని విరుచుకుపడ్డారు. ఇలాంటి వారిని గట్టిగా దెబ్బకొట్టాలని పిలుపునిచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్.

First published:

Tags: CM KCR, Mahbubnagar, PM Narendra Modi, Telangana

ఉత్తమ కథలు