హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: తెలంగాణలో లాక్‌డౌన్ ఉండదు.. తేల్చిచెప్పిన సీఎం కేసీఆర్

Telangana: తెలంగాణలో లాక్‌డౌన్ ఉండదు.. తేల్చిచెప్పిన సీఎం కేసీఆర్

కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రంలోనూ ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ఉత్తర్వులు విడుదలయ్యాయి.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రంలోనూ ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ఉత్తర్వులు విడుదలయ్యాయి.

Telangana: మహారాష్ట్ర, చత్తీస్ గడ్, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్ తదితర రాష్ట్రాలనుంచి హైద్రాబాద్ కు కోవిడ్ చికిత్సకోసం చేరుకోవడం వలన హైద్రాబాద్ మీద భారం పెరిగిపోయిందని సిఎం వివరించారు.

  తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించబోమని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. లాక్ డౌన్ విధించడం వలన ప్రజాజీవనం స్థంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదముందని ఆయన తెలిపారు. గత అనుభవాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో లౌక్ డౌన్ విధించినా కూడా పాజిటివ్ కేసులు తగ్గడం లేదనే విషయాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి కావాల్సిన వాక్సిన్లు ఆక్సీజన్ రెమిడిసివర్ సరఫరా గురించి ప్రధాని నరేంద్రమోడితో ఫోన్‌లో మాట్లాడి తక్షణమే రాష్ట్రానికి సమకూర్చాల్సిందిగా అభ్యర్థించారు. తమిళనాడులోని శ్రీ పెరంబదూరు నుంచి కర్నాటకలోని బళ్లారి నుంచి రాష్ట్రానికి కేటాయించిన ఆక్సీజన్ అందడంలేదని ప్రధాని దృష్టికి తెచ్చారు. మెడికల్ హబ్‌గా హైదరాబాద్ మారినందును సరిహద్దు రాష్ట్రాల ప్రజలు కూడా హైద్రాబాద్ మీదనే వైద్యసేవలకు ఆధారపడుతున్నారని తెలిపారు. మహారాష్ట్ర, చత్తీస్ గడ్, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలనుంచి హైద్రాబాద్ కు కోవిడ్ చికిత్సకోసం చేరుకోవడం వలన హైద్రాబాద్ మీద భారం పెరిగిపోయిందని సీఎం కేసీఆర్ వివరించారు.

  తెలంగాణ జనాభాకు అధనంగా 50 శాతం కరోనా పేషెంట్లు ఇతర రాష్ట్రాలనుంచి రావడం వలన హైద్రాబాద్ మీద ఆక్సీజన్ వాక్సీన్ రెమిడిసివర్ మంటి మందుల లభ్యతమీద పడుతున్నదని ప్రధానికి సిఎం తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రస్థుతం రోజుకు 440 మెట్రిక్ టన్నుల ఆక్సీజన్ మాత్రమే రాష్ట్రానికి అందుతోందని దాన్ని 500 మెట్రిక్ టన్నుల కుపెంచాల్సిందిగా ప్రధానిని కోరారు. రోజుకు తెలంగాణలో కేవలం 4900 రెమిడిసివర్లు మాత్రమే అందుతున్నాయని వాటిని రోజుకు కనీసం 25000 కు పెంచాలని కోరారు. ఇప్పటి వరకు కేంద్రం 50 లక్షల డోసులను అందచేసిందని కానీ రాష్ట్ర అవసరాల ద్రుష్ట్యా అవసరం మరింతగా వున్నదని కోరారు. రాష్ట్రానికి వాక్సీన్లు ప్రతిరోజుకు 2 నుంచి2.5 లక్షల డోసులు అవసరం పడుతున్నదని వాటిని సత్వరమే సరఫరాచేయాలని ప్రధాని మోడీని సిఎం కెసిఆర్ విజ్జప్తి చేశారు.

  సిఎం కెసిఆర్ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేయడంతో కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ సిఎం కేసీఆర్‌తో మాట్లాడారు. ప్రధాని కెసిఆర్ విన్నవించిన అంశాలన్నింటిని సత్వరమే రాష్ట్రానికి సమాకూరుస్తామని, ఆక్సీజన్ వాక్సీన్ రెమిడిసివర్ సత్వర సరఫరాకు చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ సీఎం కేసీఆర్‌కు హామీ ఇచ్చారు. ఆక్సీజన్‌ను కర్నాటక తమిళనాడు నుంచి కాకుండా తూర్పు రాష్ట్రాలనుంచి సరఫరా జరిగేలా చూస్తామన్నారు.

  ప్రజలకు ఇంటికే కోవిడ్ మెడికల్ కిట్లు

  కరోనా విషయంలో ప్రజలు భయాందోళన గురికావద్దని సిఎం కోరారు. ఎవరికైనా ఏమాత్రం అనుమానం వచ్చినా టెస్టుల కోసం ఆందోళన చెందకుండా ముందస్తుగా ప్రభుత్వం అందించే ....కోవిడ్ మెడికల్ కిట్లను వినియోగించుకోవాలన్నారు. ఆశా వర్కర్లు ఎఎన్ఎం ల ద్వారా ఇంటింటికీ అందచేస్తామన్నారు. ఇందులో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించే కరపత్రంతో పాటు మందులు అందజేస్తారని తెలిపారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: CM KCR, Lockdown, Telangana

  ఉత్తమ కథలు