Telangana: తెలంగాణ దళిత బంధుకు ‘హుజూరాబాద్’ అనుభవాలే కీలకమన్న సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

Telangana: ఉన్నతాధికారులు, ఉద్యోగులు దళిత ప్రముఖులు, దళిత సంఘాల నేతలు యాక్టివిస్టులతో కూడిన వర్క్ షాపు త్వరలో నిర్వహించనున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు.

  • Share this:
    తమ అభివృద్ధిని తామే నిర్వచించుకునే దిశగా చైతన్యమై, ఉత్పత్తిలో భాగస్వాములైన నాడే దళితుల సాధికారతకు నిజమైన అర్థం లభిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. అనతి కాలంలో ఆర్థిక స్వావలంబన కలిగించే వినూత్న ఉపాధి స్కీంలను ‘తెలంగాణ దళిత బంధు’ పథకంలో భాగంగా రూపకల్పన చేసి లబ్ధిదారుల ముందుంచాలని తెలిపారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ముందు అధికారులు సెన్సిటైజ్ కావడం ఆ తర్వాత అర్హులైన లబ్ధిదారులను పథకం ఉపయోగించుకోవడంలో ఉద్ధీపన (సెన్సిటైజ్) కలిగించాలని సీఎం అధికారులకు తెలిపారు. రాష్ట్రంలోని దళితుల అభివృద్ధికోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న తెలంగాణ దళిత బంధు పథకం అమలు విధి విధానాలు, రూపొందించాల్సిన ఉపాధి పథకాలపై సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్ లో సమీక్షాసమావేశం నిర్వహించారు.

    క్షేత్రస్థాయిలో పైలట్ ప్రాజెక్టు నియోజకవర్గ గ్రామాల్లో పర్యటించి దళిత కుటుంబాల స్థితి గతులను అర్థం చేసుకోవాలని అన్నారు. ఉన్నతాధికారులు ప్రభుత్వ యంత్రాంగం పైలెట్ ప్రాజెక్టు కేంద్రంగా ముందో అవగాహన పెంచుకోవాలని తెలిపారు. ఉపాధి కల్పించే పలు వినూత్న పథకాల రూప కల్పనకోసం క్షేత్రస్థాయి పర్యటలను ఎలా చేపట్టాలి, ఆ సందర్బంగా ఎవరెవరిని కలవాలి, వారి నుంచి సమాచారం ఏ విధంగా తీసుకోవాలి, దళితుల అభ్యున్నతి కోసం పనిచేస్తున్న అనుభవజ్జుల సలహాలను పాటించి వారి సూచనలను పథకంలో భాగంగా ఎట్లా అమలు పరచాలనే అంశాల మీద ముందుగా అధికారులు సెన్సిటైజ్ కావాలని సిఎం సూచించారు. ఇందులో భాగంగా ఉన్నతాధికారులు ఉద్యోగులు దళిత ప్రముఖులు, దళిత సంఘాల నేతలు యాక్టివిస్టులతో కూడిన వర్క్ షాపు త్వరలో నిర్వహించనున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు.

    వర్కుషాప్ లో తీసుకున్న నిర్ణయాలను అనుసరించి పైలట్ ప్రాజెక్టు చేపడుతున్న నియోజకవర్గంలోని దళిత వాడలకు వెళ్లాలని, అక్కడ దళిత కుటుంబాలతో మాట్లాడాలని, దళిత సమస్యల పై అవగాహన వున్న దళిత ప్రముఖులను కలవాలని వారి సలహాలు సూచనలతో స్కీమ్‌లను రూపొందించాలని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ దిశగా పైలట్ ప్రాజెక్టులో అవగాహన పెంచుకోవాలని సూచించారు. మొత్తంగా దళిత బంధు కింద అర్హులైన లబ్ధిదారులకు అందించే ఉపాధి స్కీమ్ వారికి ఇష్టమైనదై వుండాలని సూచించారు. హుజూరాబాద్‌లో క్షేత్రస్థాయి అనుభవాలను అర్థంచేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధును అమలు చేయడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సీఎం కేసీఆర్ తెలిపారు.
    Published by:Kishore Akkaladevi
    First published: