హోమ్ /వార్తలు /తెలంగాణ /

KCR Meeting With farmers: రైతుల సమస్యలు తీరాలంటే అదొక్కటే మార్గం: సీఎం కేసీఆర్​

KCR Meeting With farmers: రైతుల సమస్యలు తీరాలంటే అదొక్కటే మార్గం: సీఎం కేసీఆర్​

సీఎం కేసీఆర్ (పాత ఫొటో)

సీఎం కేసీఆర్ (పాత ఫొటో)

రైతు సంఘాల నేతలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ రెండో రోజు  సమావేశం ముగిసింది. హైదరాబాద్​లోని ప్రగతిభవన్‌లో జరిగిన ఈ సమావేశానికి 26 రాష్ట్రాల రైతు సంఘాల నేతలు హజరయ్యారు. ఈ సందర్బంగా కేసీఆర్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  రైతు సంఘాల నేతలో (Farmers Wings) తెలంగాణ సీఎం కేసీఆర్‌ (Telangana CM KCR) రెండో రోజు  సమావేశం ముగిసింది. హైదరాబాద్ (Hyderabad)​లోని ప్రగతిభవన్‌లో జరిగిన ఈ సమావేశానికి 26 రాష్ట్రాల రైతు సంఘాల నేతలు హజరయ్యారు.ఈ సమావేశంలో జాతీయస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సాగునీటి రంగం, గిట్టుబాటు ధరలు తదితర అంశాలపై చర్చించారు. బీజేపీ (BJP) పాలిత రాష్ట్రాల్లో వ్యవసాయ రంగం (Agricultural sector) ఎలా ఉంది? బీజేపీయేతర రాష్ట్రాల్లో రైతుల స్థితిగతులు ఎలా ఉన్నాయి? అనే అంశాలను కూడా సమీక్షించారు. కాగా, దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో, గ్రామస్థాయి నుంచే రైతులు ఏకం కావాలని నేతలు తీర్మానించారు. దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగానికి ఓ భరోసా అందించేలా కార్యాచరణ ఉండాలని అభిలషించారు. రైతులు నష్టపోయేలా ఉన్న కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రశ్నించాలని నిర్ణయించారు. రైతు వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటం చేద్దామని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. రాజకీయ నిర్ణయాల్లో భాగంగా రైతులు నష్టపోయే చర్యలను ఎండగట్టాలని సీఎం కేసీఆర్ తెలిపారు.


  ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. ఉద్యమ పంథాకు పార్లమెంటరీ పంథాను సమన్వయం చేసి జమిలి పోరాటాలు (Jamili struggles) సాగించడం ద్వారా మాత్రమే దేశ వ్యవసాయ, రైతాంగ సమస్యలకు పరిష్కారం సాధ్యమని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనుసరించిన జమిలి పంథానే దేశ రైతాంగ సమస్యల పరిష్కారానికి అనుసరించడం ద్వారానే గమ్యాన్ని చేరుకోగలమని తెలిపారు.  ఆనాడు తెలంగాణ ప్రజలను ఇంటింటికి ఒక యువకుడిని పంపమని అడిగానని.. అనుమానాలను పటాపంచలు చేసి తెలంగాణను నిజం చేశానని సీఎం గుర్తుచేశారు. రాజకీయ నిర్ణయాల వల్లే ప్రజా జీవితాలు ప్రభావితం అవుతాయని.. చట్టసభలకు దూరంగా జరిగే పోరాటాలు సఫలీకృతం కావని సీఎం అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో రైతు నేతలు భాగస్వామ్యం కావాలని.. దేశానికి అన్నం పెట్టే రైతులు చట్టసభల్లోకి ఎందుకు వెళ్లకూడదని కేసీఆర్ ప్రశ్నించారు. 75 ఏళ్ల స్వతంత్ర భారత్‌లో ఇంకా సమస్యలున్నాయని సీఎం అన్నారు. వ్యవసాయం ఈ దేశ ప్రజల జీవన విధానమని కేసీఆర్ చెప్పారు.


  Komati Reddy: కేసీఆర్​ ఆ పని చేయకపోతే రక్త పాతం తప్పదు.. కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి హెచ్చరిక


  తెలంగాణ ప్ర‌భుత్వం (Telangana Government) రైతుల‌కు అందిస్తున్న మ‌ద్ద‌తును కూడా కేసీఆర్  రైతు సంఘాల నేతలకు తెలిపారు. రాష్ట్రంలో రైతన్న‌ల‌కు (farmers) పూర్తిగా ఉచిత విద్యుత్ అందిస్తున్న‌ట్లు చెప్పారు సీఎం. అంతేకాకుండా.. రైతుల‌కు పెట్టుబ‌డి సాయంగా అందించే రైతు బంధు ప‌థ‌కం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు వివ‌రించారు. తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ విధానాలు దేశవ్యాప్తంగా అమలయ్యేలా చూసేందుకు జాతీయ రైతు ఐక్య వేదిక ఏర్పాటు కావాలని జాతీయ రైతుసంఘాల ప్రతినిధుల సమావేశం ముక్తకంఠంతో తీర్మానించింది.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: CM KCR, Farmers, Hyderabad

  ఉత్తమ కథలు