ఏడాది లోపు పాలమూరు ప్రాజెక్టులు పూర్తి...సీఎం కేసీఆర్ హామీ

కేసీఆర్ (File)

పాలమూరు పాలుగానే ఊరుగా మారుతుందని ఆకాంక్షించారు. కొంత మంది కేసులు వేయడం వల్లే ప్రాజెక్టు పనులు ఆలస్యమయ్యాయని విమర్శించారు సీఎం కేసీఆర్.

  • Share this:
    పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఏడాది లోపు పూర్తి చేస్తామని తెలంగాణ సీఎం స్పష్టంచేశారు. పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ప్రాజెక్టు పూర్తైతే ఉమ్మడి పాలమూరులో మంచి ఫలితాలు వస్తాయన్నారు సీఎం. గురువారం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. పలు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించి కరివెన, ఒట్టెం, ఏదుల రిజర్వాయర్లను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు పురోగతిపై అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం.

    ఇకపై మూడు షిఫ్టుల్లో పనులు జరుగుతాయని..మరో 9-10 నెలల్లో పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తవుతుందని తెలిపారు కేసీఆర్. ఈ ప్రాజెక్టు పూర్తైతే పాలమూరులో అద్భుతమైన ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. పాలమూరు పాలుగారే ఊరుగా మారుతుందని ఆకాంక్షించారు. కొంత మంది కేసులు వేయడం వల్లే ప్రాజెక్టు పనులు ఆలస్యమయ్యాయని విమర్శించారు తెలంగాణ సీఎం. గత పాలకుల అసమర్థత వల్ల తెలంగాణకు అన్యాయం జరిగిందన్న కేసీఆర్..మంచినీళ్ల కోసం మనం అనేకసార్లు కర్ణాటకను బతిమాలామని గుర్తుచేశారు. గోదావరిని కృష్ణాతో ఈ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని స్పష్టంచేశారు.
    First published: