• HOME
 • »
 • NEWS
 • »
 • TELANGANA
 • »
 • TELANGANA CM KCR REVIEW WITH PANCHAYAT RAJ AND MUNICIPAL OFFICERS TOOK A KEY DECISION AK

Telangana: తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. ఇక స్వయంగా రంగంలోకి..

Telangana: తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. ఇక స్వయంగా రంగంలోకి..

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Telangana: రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందని, రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 4.7 శాతానికి పడిపోయిందని సీఎం కేసీఆర్ తెలిపారు.

 • Share this:
  రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల్లో జరుగుతున్న ప్రగతి తీరును పంచాయతీరాజ్, మున్సిపాలిటీ అధికారుల పనితీరును పరిశీలించేందుకు జూన్ 19 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలను తానే స్వయంగా చేపడుతానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందులో భాగంగా పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాల క్షేత్రస్థాయి పనితీరును సమీక్షించడానికి జూన్ 13న అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారుల (డీపీవో)లతో ప్రగతి భవన్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ముందస్తు చర్యలను సిద్ధం చేసుకునే చార్టును రూపొందించుకోవాలని, దానికి అనుగుణంగా ప్రతీ సీజన్లో ముందస్తు కార్యాచరణను చేపట్టే సంస్కృతిని ఆయా శాఖల ప్రభుత్వ యంత్రాంగం అభివృద్ధి చేసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

  రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందని, రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 4.7 శాతానికి పడిపోయిందని సీఎం కేసీఆర్ తెలిపారు. కరోనా పూర్తిగా తగ్గిన తర్వాత, త్వరలో మరో విడత పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను చేపడుతామని తెలిపారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడానికి అటవీ శాఖ ప్రత్యేక కార్యాచరణను కొనసాగించాలని ఆదేశించారు. నూతన పంచాయతీ రాజ్, మున్సిపాలిటీ చట్టాలను అమల్లోకి తెచ్చి పల్లెలు, పట్టణాల అభివృద్దికి దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వం సహకారం అందిస్తున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రతినెలా గ్రామాల అభివృద్ధికోసం, రూ. 339 కోట్లు, మున్సిపాలిటీల అభివృద్ధి కోసం 148 కోట్ల రూపాయలను క్రమం తప్పకుండా విడుదల చేస్తోందని సీఎం కేసీఆర్ తెలిపారు.

  గ్రామాలు, పట్టణాల్లో జరుగుతున్న ప్రగతిలో భాగంగా పారిశుధ్యం, పచ్చదనం, మంచినీటి సరఫరా, రోజువారీ పరిశుభ్రత, మొక్కల స్థితి, మొక్కలు బతికిన శాతం, గ్రామసభలు నిర్వహించిన తీరు, స్థానిక ఎంపీవోలు పాల్గొన్న తీరు, అందులో వారు గ్రామ ప్రగతి కోసం తీసుకున్న చర్యలు, ఎన్నిసార్లు గ్రామ సభలు నిర్వహించారు, గ్రామ ప్రగతి నివేదికల మీద జరిగిన చర్చల సారాంశం వంటి అంశాలను చార్టులో పొందుపరచాలన్నారు. వాటితో పాటు, చెత్తసేకరణ, డంపుయార్డులు, వైకుంఠధామాల నిర్మాణ స్థితి, బోరుబావులు పూడ్చడం, ప్రభుత్వ కార్యాలయాలలో పారిశుధ్య నిర్వహణ, ట్రాక్టర్ల కిస్తులు కడుతున్నతీరు, కరెంటు బిల్లుల వసూలు, గ్రామ పంచాయితీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం, డ్రైనేజీలు, నాలాలు క్లీనింగ్, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణం, వంటి అంశాలను చేర్చాలన్నారు.

  వాటితో పాటు ఉత్తమ గ్రామాలను, మండలాలను, అధ్వానంగా ఉన్న గ్రామాలు మండలాలను.. గుర్తించడం వాటికి గల కారణాలను ఈ చార్టులో ప్రత్యేకంగా పేర్కొనాలని సిఎం ఆదేశించారు. అన్ని రకాల అంశాలను పొందుపరిచి వాటిల్లో జరుగుతున్న పురోగతినే కాకుండా వెనుబాటును కూడా చార్టు రూపంలో సిద్దం చేయాలని మంచి చెడులను రెండింటిని ప్రాతిపదికగా తీసుకుని చార్టును తయారు చేసి, ఆకస్మిక తనిఖీ పర్యటనలో తనకు అందచేయాలని సీఎస్‌ను ఆదేశించారు.
  Published by:Kishore Akkaladevi
  First published:

  అగ్ర కథనాలు