Home /News /telangana /

TELANGANA CM KCR REQUESTED SENIOR DIRECTOR K VISWANATH TO DIRECT A MOVIE AK

మళ్లీ సినిమా తీయండి... కళాతపస్వికి కేసీఆర్ విజ్ఞప్తి

విశ్వనాథ్‌ను కలిసిన కేసీఆర్

విశ్వనాథ్‌ను కలిసిన కేసీఆర్

హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లోని విశ్వనాథ్ నివాసానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లారు. నేను మీ అభిమానినని విశ్వనాథ్‌కు వివరించిన కేసీఆర్... చిన్నప్పటి నుంచీ మీ సినిమాలంటే చాలా ఇష్టమని తెలిపారు.

    సీనియర్ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్‌ను కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఉన్నత విలువలతో కూడిన ఎన్నో గొప్ప చిత్రాలు తీసిన దర్శకుడు విశ్వనాథ్ ఆధ్వర్యంలో సమాజానికి మంచి సందేశం అందించే మరో చిత్రం రావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. విశ్వనాథ్ దర్శకుడయితే, నిర్మాణ పరమైన విషయాలు తాను చూసుకుంటానని మాటిచ్చారు. హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లోని విశ్వనాథ్ నివాసానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లారు. నేను మీ అభిమానినని విశ్వనాథ్‌కు వివరించిన కేసీఆర్... చిన్నప్పటి నుంచీ మీ సినిమాలంటే చాలా ఇష్టమని తెలిపారు.

    మీరు తీసిన ప్రతీ సినిమా చూశానని విశ్వనాథ్‌కు కేసీఆర్ వివరించారు. శంకరాభరణం 25 సార్లకు పైగా చూసి ఉంటానని చెప్పారు. సినిమా చూసిన ప్రతీసారి మిమ్మల్ని ఓ సారి కలవాలనిపించేదని... ఇన్నాళ్లకు ఆ కోరిక తీరిందని అన్నారు. మీపై ఉన్న అభిమానమే నన్ను మీ దగ్గరకి తీసుకొచ్చిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మీ సినిమాలు రాక పదేళ్లయిందన్న కేసీఆర్... మీరు మళ్ళీ సినిమా తీయాలని విశ్వనాథ్‌ను కోరారు. సహాయకుల ద్వారా మీ మార్గదర్శకత్వంలో సినిమా తీద్దామంటే నిర్మాణ బాధ్యతలు స్వీకరించడానికి నేను సిద్ధమని కేసీఆర్ ఆయనకు వివరించారు. దయచేసి దీనికోసం ప్రణాళిక సిద్ధం చేయండని కోరారు. హైదరాబాద్ లో సినిమా పరిశ్రమ ఇంకా బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందన్న కేసీఆర్... ప్రభుత్వం కూడా త్వరలోనే సినిమా పరిశ్రమ కోసం కొత్త పాలసీ తెస్తుందని విశ్వనాథ్‌కు వివరించారు.




    First published:

    Tags: CM KCR, K viswanath, Telangana, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు