Home /News /telangana /

TELANGANA CM KCR REACTED POSITIVELY ON EMPLOYEES PRC SAYS UNION LEADERS AFTER MEETING HIM AK

Telangana PRC: ఉద్యోగుల పీఆర్సీపై సీఎం కేసీఆర్ క్లారిటీ.. వారికంటే ఎక్కువగా..

సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

Telangana PRC: సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాల‌కు పెన్షన్ స్కీమ్ అమలు విషయంలోనూ సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారని ఉద్యోగ సంఘం నేతలు తెలిపారు.

    ఉద్యోగుల పీఆర్సీ పెంపు విషయంలో సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారని తెలంగాణ ఉద్యోగ సంఘం నేతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు ఇస్తున్న పీఆర్సీ కంటే ఎక్కువ ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పారని అన్నారు. సీఎం కేసీఆర్‌తో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడిన ఉద్యోగ సంఘం నేతలు.. ఉద్యోగుల స‌మ‌స్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టు వెల్లడించారు. ఎన్నిక‌ల నియ‌మావ‌ళికి లోబ‌డే తాము సీఎం కేసీఆర్‌తో స‌మావేశ‌మైన‌ట్లు ఉద్యోగ సంఘాల నేత‌లు పేర్కొన్నారు. ఉద్యోగుల ప‌దోన్నతలు కూడా త్వరగానే ఇచ్చారని తెలిపారు. పీఆర్సీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు అన్యాయం చేయదని చెప్పుకొచ్చారు.

    పీఆర్సీ విషయంలో సీఎం కేసీఆర్ చాలా క్లారిటీ ఇచ్చారని.. తమకు కేసీఆర్‌పై నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. ఎలక్షన్ కోడ్ ఉండటం వల్లే దీనిపై ప్రకటన చేయలేకపోతున్నట్టు సీఎం కేసీఆర్ తమకు చెప్పినట్టు తెలిపారు. ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత పీఆర్సీపై ప్రకటన వస్తుందని అన్నారు. 2014 త‌ర్వాత దేశంలోనే తెలంగాణలో సీఎం కేసీఆర్ అత్యధిక పీఆర్సీ ఇచ్చారని నేతలు గుర్తు చేశారు.

    ఉద్యోగుల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌స్సు పెంపును కూడా త్వరలోనే అమలు చేస్తామని సీఎం కేసీఆర్ తమకు చెప్పారని నేతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఉద్యోగుల‌ను తెలంగాణ‌కు తీసుకురావ‌డానికి సీఎం కేసీఆర్ అంగీక‌రించి అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారని అన్నారు. సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాల‌కు పెన్షన్ స్కీమ్ అమలు విషయంలోనూ సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారని ఉద్యోగ సంఘం నేతలు తెలిపారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: CM KCR, Telangana, Telangana employees

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు