హోమ్ /వార్తలు /తెలంగాణ /

CM KCR: కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. గజ్వేల్ ను కాదని ఈ సారి అక్కడి నుంచి పోటీ.. ఎందుకంటే?

CM KCR: కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. గజ్వేల్ ను కాదని ఈ సారి అక్కడి నుంచి పోటీ.. ఎందుకంటే?

సీఎం కేసీఆర్ ఈ సారి నియోజకవర్గాన్ని మార్చేందుకు సిద్ధమయ్యారు. గజ్వేల్ ను వీడాలని డిసైడ్ అయ్యారు. ఈ నిర్ణయానికి కారణమైన కేసీఆర్ మాస్టర్ గురించి పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ సాగుతోంది.

సీఎం కేసీఆర్ ఈ సారి నియోజకవర్గాన్ని మార్చేందుకు సిద్ధమయ్యారు. గజ్వేల్ ను వీడాలని డిసైడ్ అయ్యారు. ఈ నిర్ణయానికి కారణమైన కేసీఆర్ మాస్టర్ గురించి పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ సాగుతోంది.

సీఎం కేసీఆర్ ఈ సారి నియోజకవర్గాన్ని మార్చేందుకు సిద్ధమయ్యారు. గజ్వేల్ ను వీడాలని డిసైడ్ అయ్యారు. ఈ నిర్ణయానికి కారణమైన కేసీఆర్ మాస్టర్ గురించి పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ సాగుతోంది.

  తెలంగాణలో ముందస్తు ఎన్నికల ముచ్చట జోరుగా సాగుతోంది. సీఎం కేసీఆర్ మరో సారి ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఖాయమన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో సాగుతోంది. అయితే.. సీఎం కేసీఆర్ మరో చర్చకు తెరలేపారు. తన వ్యూహాలతో ప్రత్యర్థి పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేసే కేసీఆర్ ఈ సారి తాను పోటీ చేసే స్థానం విషయంపై మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇటీవల పలువురు నేతల వద్ద సీఎం స్వయంగా ప్రస్తావించినట్లు వాస్తలు వస్తున్నాయి. దీంతో ఈ అంశం చుట్టూ జోరుగా విశ్లేషణలు సాగుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేటకు చెందిన సీఎం కేసీఆర్.. తెలంగాణ ఉద్యమం సమయంలో కరీంనగర్, మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. తద్వారా ఆయా ప్రాంతాల్లో పార్టీతో పాటు ఉద్యమాన్ని పరుగులు పెట్టించారు. అయితే రానున్న ఎన్నికల్లో పార్టీ బలం మరింత పెరిగేలా సీఎం కేసీఆర్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు.

  ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ బలం కేసీఆర్ ఆశించిన స్థాయిలో పెరగడం లేదని పార్టీ వర్గాల్లో చర్చ ఉంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది. గత ఎంపీ ఎన్నికల్లో జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో హస్తం పార్టీ అభ్యర్థులే విజయం సాధించడం ఇందుకు నిదర్శనం. కాంగ్రెస్ మహామహులైన జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి, అద్దంకి దయాకర్ లాంటి నేతలు ఈ జిల్లాకు చెందిన వారే. అయితే.. 2014లో రాష్ట్రం మొత్తం టీఆర్ఎస్ గాలి వీచినా.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మాత్రం కాంగ్రెస్ నుంచి జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇక్కడి నుంచి గెలుపొందారు. అనంతరం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించి సత్తా చాటారు.

  అయితే.. 2018లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ మెజారిటీ స్థానాల్లో విజయం సాధించినా.. పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ పై చేయి సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ లోకి భారీగా వలసలు సాగినా.. ఈ జిల్లాలో మాత్రం అంతగా సాగలేదు. గుత్తా సుఖేందర్ రెడ్డి మినహా.. ఆ స్థాయి నేతలెవరూ కారు పార్టీ కండువా కప్పుకోలేదు. దీంతో సీఎం స్వయంగా రంగంలోకి దిగాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. మొదట సీఎం యాదాద్రి ఆలయం కొలువైన ఆలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం సాగినా అక్కడి నుంచి పోటీకి కేసీఆర్ అంతగా ఆసక్తిగా లేరని తెలుస్తోంది.

  మునుగోడు నుంచి పోటీ చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు పార్టీలోని ముఖ్యనేతలు చెబుతున్నారు. అక్కడి నుంచి తాను పోటీ చేస్తే ఉమ్మడి జిల్లాలోని ఇతర నియోజకవర్గాలపై ఆ ప్రభావం ఉంటుందన్నది సీఎం ఆలోచనగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మునుగోడు నుంచి పోటీ చేయాలని సీఎం డిసైడ్ అయినట్లు గులాబీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని కేసీఆరే స్వయంగా ఓ ముఖ్య నేత వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. అయితే.. ప్రస్తుతం మునుగోడు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

  First published:

  Tags: CM KCR, Nalgonda, Telangana

  ఉత్తమ కథలు