తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. అమరవీరుల స్తూపం వద్ద సీఎం కేసీఆర్ నివాళి..

అమర వీరుల స్తూపం వద్ద సీఎం కేసీఆర్ నివాళి

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద సీఎం కేసీఆర్‌ నివాళి అర్పించారు.

  • Share this:
    తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద సీఎం కేసీఆర్‌ నివాళి అర్పించారు. ఆయనతో పాటు హోం మంత్రి మహమూద్‌ అలీ, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ కుమార్‌ తదితరులు కూడా నివాళి అర్పించారు. కరోనా నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు. గన్‌ పార్క్‌ నుంచి సీఎం కేసీఆర్ నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. అటు.. తెలంగాణ భవన్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. రాజ్యసభ సభ్యుడు కేశవరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు.


    Published by:Shravan Kumar Bommakanti
    First published: