కేసీఆర్ కీలక నిర్ణయం... యాదాద్రి కోసం...

యాదాద్రిలో ఆలయ నిర్మాణం పనులను పరిశీలించడంతో పాటు అధికారులతో సమీక్ష నిర్వహించిన కేసీఆర్... పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: August 18, 2019, 12:34 PM IST
కేసీఆర్ కీలక నిర్ణయం... యాదాద్రి కోసం...
సీఎం కేసీఆర్, యాదాద్రి ఆలయం
  • Share this:
యాదాద్రిలో ఆలయ నిర్మాణం పనులు వేగంగా సాగకపోవడంపై ఆగ్రహంగా ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్... అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. యాదాద్రిలో ఆలయ నిర్మాణం పనులను పరిశీలించడంతో పాటు అధికారులతో సమీక్ష నిర్వహించిన కేసీఆర్... పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇకపై యాదాద్రిలో జరుతుగుతన్న పనులను ప్రతివారం మంత్రి ప్రశాంత్ రెడ్డి పరిశీలిస్తారని కేసీఆర్ అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది. రోడ్లు, భవనాల శాఖమంత్రిగా ఉన్న ప్రశాంత్ రెడ్డి... కేసీఆర్ ఆదేశాలతో ఇక ప్రతివారం యాదాద్రిలో పర్యటించేందుకు రాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

సాధ్యమైనంత తొందరగా పనులు పూర్తి కావాలనే పట్టుదలతో ఉన్న కేసీఆర్... ఇందుకోసం తనకు సన్నిహితుడైన మంత్రి ప్రశాంత్ రెడ్డిని ఈ మేరకు ఆదేశించినట్టు తెలుస్తోంది. ప్రధాన ఆలయం పనులతో పాటు రింగురోడ్డు నిర్మాణం, ప్రెసెడెన్షియల్‌ సూట్స్‌, కాటేజీల నిర్మాణం, విద్యుత్ సబ్‌స్టేషన్‌ తదితర పనులన్నీ 2, 3 నెలల్లో పూర్తి చేయాలని సూచించారు. టెంపుల్‌ సిటీలో 250 కాటేజీల నిర్మాణాన్ని ప్రారంభించాలని, రూ.400 కోట్ల విరాళాలిచ్చేందుకు దాతలు సిద్ధంగా ఉన్నారని కేసీఆర్ సూచంచారు. భూసేకరణ త్వరగా పూర్తి చేసి ప్రధాన రహదారులన్నీ వెడల్పుగా నిర్మించాలని అధికారులకు సూచించారు. యాదాద్రి పనుల కోసం ఇప్పటిదాకా రూ. 692 కోట్లు ఖర్చుచేసినట్లు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు.


First published: August 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు