Home /News /telangana /

TELANGANA CM KCR NAMES TUPAKULAGUDEM PROJECT AS SAMMAKKA PROJECT SK

సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. ఆ బ్యారేజీకి సమ్మక్క పేరు..

కేసీఆర్‌(ఫైల్ ఫోటో)

కేసీఆర్‌(ఫైల్ ఫోటో)

సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయ్యి తెలంగాణ బీల్లల్లోకి కాళేశ్వరం సాగునీళ్లు చేరుకుంటున్న శుభ సందర్భంలో ఇప్పటికే పలు బ్యారేజీలకు, రిజర్వాయర్లకు దేవతామూర్తుల పేర్లను పెట్టుకున్నామని సీఎం గుర్తు చేశారు.

  గోదావరి నది మీద నిర్మితమవుతున్న తుపాకుల గూడెం బ్యారేజీకి తెలంగాణ ఆదీవాసీ వీరవనిత, వనదేవత.. ‘‘సమ్మక్క’’ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు.. తుపాకులగూడెం బ్యారేజీకి ‘‘సమ్మక్క బ్యారేజీ’’ గా నామకరణం చేస్తూ సంబంధిత జీవోను జారీ చేయాలని ఇఎన్సీ మురళీధర్ రావు ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ముక్కోటి దేవతల కరుణాకటాక్షాలు బలంగా వుండడం చేతనే తెలంగాణలో అభివృద్ధి అనుకున్న రీతిలో సాగుతున్నదని కేసీఆర్ తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయ్యి తెలంగాణ బీల్లల్లోకి కాళేశ్వరం సాగునీళ్లు చేరుకుంటున్న శుభ సందర్భంలో ఇప్పటికే పలు బ్యారేజీలకు, రిజర్వాయర్లకు దేవతామూర్తుల పేర్లను పెట్టుకున్నామని సీఎం గుర్తు చేశారు.

  ఇక గురువారం నాడు కాళేశ్వరం ప్రాజెక్టులను సందర్శించనున్నారు సీఎం కేసీఆర్. ఈ నేపథ్యంలో బుధవారం  ప్రగతి భవన్‌లో సంబంధిత అధికారులతో  ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ‘‘కాళేశ్వరం ప్రాజెక్టులలోకి అనుకున్న రీతిలో సాగునీరు చేరుకుంటున్నది. ఇప్పుడు మనం కట్టుకున్న బ్యారేజీలు నిండుకుండలా మారినయి. రానున్న వానం కాలం నుంచి వరద నీటి ప్రవాహం పెరుగుతుంది. ప్రాణహిత ద్వారా లక్ష్మీ బారేజీకి చేరుకునే వరద నీటిని ఎప్పటికప్పుడు ఎగువకు ఎత్తి పోసుకునే దిశగా..అటునుంచి కాలువలకు మల్లించే దిశగా.. ఇర్రిగేషన్ శాఖ ఇప్పటినుంచే అప్రమత్తం కావాలె. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలి’’..అని అధికారులకు సూచించారు. అందులో భాగంగా పనుల విభజన చేసుకోవాలని స్పష్టం చేశారు.

  ఈ సమీక్షాసమావేశంలో మంత్రులు గుంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్, రైతుసమన్వయ సమితి అధ్యక్షులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సిఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, సిఎం ఓఎస్డీ శ్రీధర్ రావు దేశ్ పాండే, సాగునీటి శాఖ ఇఎన్ సీ మురళీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: CM KCR, Kaleshwaram project, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు