Home /News /telangana /

CM kcr Mahadhrana : సీఎం కేసిఆర్ పాదయాత్ర.. ? ఇందిరాపార్క్ నుండి రాజ్‌భవన్‌కు

CM kcr Mahadhrana : సీఎం కేసిఆర్ పాదయాత్ర.. ? ఇందిరాపార్క్ నుండి రాజ్‌భవన్‌కు

CM kcr Mahadhrana : కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని  మహాధర్న చేపట్టిన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసిఆర్ ఇందిరాపార్క్‌ ధర్నా అనంతరం నేరుగా ఆయన రాజ్‌భవన్‌కు చేరుకొనున్నారు. గవర్నర్‌ను కలిసి వినతి పత్రం అందించనున్నారు..

ఇంకా చదవండి ...
    ఇందిరాపార్క్ ( Indirapark mahadharna) వద్ద సీఎం కేసిఆర్ చేపట్టిన మహాధర్నా మరోకీలక మలుపు తిరగనుందా.. ధర్నా తర్వాత నేరుగా ఆయన గవర్నర్‌ను కలిసి వినతి అందించనున్నారు. అయితే ఇందిరా పార్క్ నుండి పాదయాత్రగా వెళతారని పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. అయితే దీనిపై పోలీసులు మాత్రం ఎలాంటీ పాదయాత్ర సమాచారం లేదని చెబుతున్నారు. ఒకవేళ పాదయాత్రలో గనుక వెళ్లినట్టయితే ఇందిరా పార్క్ నుండి వయా తెలుగు తల్లి ఫ్లై ఓవర్ , సేక్రటేరియట్ తోపాటు ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ మీదుగా రాజ్ భవన్‌కు సుమారు మూడు కిలోమీటర్ల మీర పాదయాత్ర చేయాల్సి ఉంటుంది.

    అయితే ఆయన కేవలం ప్రజాప్రతినిధులతో కలిసి గవర్నర్‌కు (governor ) మెమోరాండ ఇస్తారనే ప్రచారం కొనసాగుతోంది. ఒకవేళ పాదయాత్ర వెళ్లాలంటే సెక్యూరిటి ఇబ్బందిగా మారుతుందని నగర పోలీసులు చెబుతున్నారు. అయితే తమకు ఉన్న సమాచారం మాత్రం కేవలం ధర్నా మాత్రమే చేసి అనంతరం గవర్నర్‌ను కలిసి వినతి పత్రం అందిస్తారని చెబుతున్నారు. దీంతో మరింత ఉత్కంఘ నెలకొంది. ఇప్పటికే ఒక ముఖ్యమంత్రి ధర్నాలు చేయడం అనేది రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇది రాజకీయ కోణంలో అటు ప్రజలు ఇటు పార్టీలు చూస్తున్న పరిస్థతి కనిపిస్తోంది. ఒక వేళ సీఎం పాదయాత్ర చేపడితే మాత్రం రాజకీయంగా మరింత యుద్ద వాతవరణం నెలకొననుంది.

    ఇది చదవండి  : వరిపై కాంగ్రెస్... రాష్ట్రానికి వ్యతిరేకంగా ర్యాలీ.. టీఆర్ఎస్, బీజేపీలు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాడ్డాయి...

    కాగా అంతకుముందు ఉదయం ధర్నాలో పాల్గోన్న సీఎం కేసిఆర్ ( cm kcr )  కేంద్రం దిగివచ్చే వరకు ధర్నా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇది అంతం కాదని, ఆరంభం మాత్రమేనని అన్నారు. రైతులకు మద్దతుగా దేశంలోని ఇతర పార్టీలను కలుపుకుని రైతుల గోడును తెలిపేందుకు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. పంజాబ్‌లో ఎలాగైతే ధాన్యం కొనుగోలు చేస్తున్నారో.. తెలంగాణలో కూడా అదే పద్దతిలో కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.. ఇందుకోసం గతంలోనే రాష్ట్ర వ్వవసాయ మంత్రి నిరంజన్‌ రెడ్డితోపాటు పాటు , తాను కూడా ఢిల్లీ వెళ్లి వినతి పత్రం ఇచ్చి, 50 రోజులు గడుస్తున్నా... ఇప్పటి వరకు కేంద్రం నుండి ఎలాంటీ స్పందన రాలేదని అన్నారు. అయినా నిన్న మరోసారి తాను లేఖ కూడా రాశానని చెప్పారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం దిగి వచ్చేవరకు తమ పోరు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

    మీ నగరం నుండి (​హైదరాబాద్)

    తెలంగాణ
    ​హైదరాబాద్
    తెలంగాణ
    ​హైదరాబాద్
    Published by:yveerash yveerash
    First published:

    Tags: CM KCR, Indira Park, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు