తెలంగాణలో నూతన వ్యవసాయా విధానాన్ని ఈ సీజన్ నుంచే అమలుచేసేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళిక రూపొందిస్తున్నారు. వానా కాలంలో ఎక్కడెక్కడ ఏ పంటలు వేయాలన్న దానిపై నిపుణల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నియంత్రిత సాగుపై ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రులు, రైతుబంధు సమితి అధ్యక్షులు, జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు సమావేశానికి హాజరయ్యారు. నియంత్రిత పంటల సాగు విధానంపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.
ప్రభుత్వం సూచించిన పంటలనే వేయాలని రైతులకు సీఎం కేసీఆర్ ఇప్పటికే విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అందరూ ఒకే రకమైన వేస్తే డిమాండ్ ఉండదని.. అందువల్ల మద్దతు ధర రాదని చెప్పారు. డిమాండ్ ఉన్న పంటలను వేస్తే రైతులు అధిక లాభాలు గడిస్తారని ఆయన చెప్పారు. అంతేకాదు వానకాలంలో మొక్కజొన్న, వరి ఎక్కువగా పండవని.. పత్తి చేను వేస్తే ఎక్కువ లాభాలు వస్తాయని ఇదివరకే చెప్పారు. మొక్కజొన్న పంటలను వానాకాలంలో కాకుండా.. యాసంగి పంటగా వేస్తే బాగుంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా ఏ పంట ఎంత వేయాలి? ఏ రకం విత్తనాలు వాడాలి? పర్యవేక్షణ, ఇతర అంశాలపై ఇవాళ్టి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు సీఎం కేసీఆర్.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.