• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • TELANGANA CM KCR MAY ANNOUNCE YADADRI TEMPLE OPENING DATE TOMORROW AK

Yadadri: నేడు యాదాద్రికి తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆ తేదీ ప్రకటన ఉంటుందా ?

Yadadri: నేడు యాదాద్రికి తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆ తేదీ ప్రకటన ఉంటుందా ?

సీఎం కేసీఆర్, యాదాద్రి ఆలయం

Yadadri: క్షేత్రస్థాయిలో పనుల జరుగుతున్న తీరును పరిశీలించిన అనంతరం చినజీయర్ స్వామితో చర్చించిన ఆలయ ప్రారంభ తేదీపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

  • Share this:
    తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు యాదాద్రి పర్యటనకు వెళ్లనున్నారు. యాదాద్రిలో ఆలయ పునర్ నిర్మాణ పనులతో పాటు ఇతర అభివృద్ధి పనులు ఎంతవరకు వచ్చాయనే దానిపై క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించనున్నారు. ఆలయ ప్రధాన పనులన్నీ ఇప్పటికే పూర్తి కాగా.. మిగిలిన పనులు కొనసాగుతున్నాయి. వాటిని శరవేగంగా పూర్తి చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించిన సీఎం కేసీఆర్.. పనులు ఏ మేరకు వచ్చాయనే దానిపై స్వయంగా చూడనున్నారు. ఇప్పటికే 90 శాతానికి పైగా గుడి నిర్మాణ పనులు పూర్తి అయ్యింది. యాదాద్రికి నలువైపులా విశాలమైన మాఢవీధులు, సప్త గోపురాలు, అంతర్ బాహ్య ప్రాకారాలు, ఆల్వార్ల విగ్రహాలతో కాకతీయ సంప్రదాయ కృష్ణశిలా శిల్పసౌరభం ఉట్టిపడేలా పనులు జరిగాయి. శివాలయం నిర్మాణం కూడా దాదాపుగా పూర్తయ్యింది. కొండపై పుష్కరిణి కూడా పూర్తిస్థాయిలో తయారైంది. కొండ కింద భక్తుల సౌకర్యార్థం మరో పుష్కరిణి పనులు జరుగుతున్నాయి కొనసాగుతున్నాయి.

    మెట్లు, ఇతర నిర్మాణాల పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రెసిడెన్షియల్ కాటేజీ సహా వీఐపీ కాటేజీల నిర్మాణం కూడా దాదాపుగా ఓ కొలిక్కి వచ్చింది. 15 కాటేజీలలో ఒకటి మినహా అన్ని పనులు పూర్తయ్యాయి. కళ్యాణకట్ట కొద్దిరోజుల్లో సిద్ధం అవుతుందని అధికారులు చెబుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒకే దగ్గర రెండు వేల వాహనాలకు పార్కింగ్ సౌలభ్యం కల్పించామని అధికారులు తెలిపారు. ఇది కూడా మరో 15 రోజుల్లో పూర్తవుతుందని యాదాద్రి డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులు భావిస్తున్నారు.

    అయితే ఈ పనులను స్వయంగా పరిశీలించనున్న సీఎం కేసీఆర్.. ఆలయ ప్రారంభ తేదీని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. జరిగిన పనులు, కొనసాగుతున్న పనులపై ఓ అంచనాకు వచ్చిన తరువాతే సీఎం కేసీఆర్ ఈ అంశంపై ఓ నిర్ణయం తీసుకుంటారని సమాచారం. నిజానికి ఫిబ్రవరిలోనూ యాదాద్రి ఆలయాన్ని పునర్ ప్రారంభించాలని సీఎం కేసీఆర్ భావించారు. అయితే పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో అది వాయిదా పడింది. అయితే క్షేత్రస్థాయిలో పనుల జరుగుతున్న తీరును పరిశీలించిన అనంతరం చినజీయర్ స్వామితో చర్చించిన ఆలయ ప్రారంభ తేదీపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు