Home /News /telangana /

TELANGANA CM KCR LEAVES FOR DELHI LIKELY TO MEET PM MODI OVER PADDY CROP AND OTHER ISSUES MKS

ప్రత్యేక విమానంలో ఢిల్లీకి CM KCR -కేంద్రంతో వరి పోరు -అగ్గి పెడతారా? -ఏం చేయబోతున్నారంటే..

ప్రత్యేక విమానంలో ఢిల్లీకి సీఎం కేసీఆర్

ప్రత్యేక విమానంలో ఢిల్లీకి సీఎం కేసీఆర్

వ్యవసాయానికి సంబంధించిన అంశాల్లో కేంద్రం తీరును తీవ్రంగా తప్పుపట్టిన కేసీఆర్.. అవసరమైతే దేశంలో అగ్గిపెడతామని, మోదీ సర్కారు మెడలు వంచుతామని హెచ్చరించిన నేపథ్యంలోనేకాక మరికొన్ని కీలక అంశాల పరంగానూ ఈ సారి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యం పెరిగింది.

ఇంకా చదవండి ...
ధాన్యం సేకరణ (paddy procurement), నీటి వాటాల పంపకం, విభజన హామీల అమలు తదితర కీలక అంశాల్లో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని ఆరోపించిన సీఎం కేసీఆర్ (CM KCR) తాడో పేడో తేల్చుకునేందుకు ఢిల్లీ పయనమయ్యారు. హైదరాబాద్(Hyderabad) లోని బెంగంపేట్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆదివారం సాయంత్రం ఆయన ఢిల్లీకి టేకాఫ్ అయ్యారు. సీఎం వెంట వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నాయకత్వంలో మంత్రుల బృందం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్వంలో అధికారుల బృందం కూడా వెళ్లింది. వ్యవసాయానికి సంబంధించిన అంశాల్లో కేంద్రం తీరును తీవ్రంగా తప్పుపట్టిన కేసీఆర్.. అవసరమైతే దేశంలో అగ్గిపెడతామని, మోదీ సర్కారు మెడలు వంచుతామని హెచ్చరించిన నేపథ్యంలోనేకాక మరికొన్ని కీలక అంశాల పరంగానూ ఈ సారి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యం పెరిగింది.

కచ్చితంగా రెండు లేదా నాలుగు రోజులు అనే కాకుండా, ప్రధాని మోదీ అపాయింట్మెంట్ ఇచ్చే వీలును బట్టి కేసీఆర్ ఢిల్లీ పర్యటన సాగనుంది. వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రం, బీజేపీల విరుద్ధ ప్రకటనల నేపథ్యంలో క్లారిటీ కోరడం ఒక అంశమైతే, కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణకు నీటి వాటాలు నిర్ధారించే ట్రిబ్యూనళ్ల ఏర్పాటు, విభజన హామీల అమలు దిశగా కేసీఆర్ వివిధ శాఖల కేంద్ర మంత్రులను కలవనున్నారు. ప్రధానితోనూ ఇవే అంశాలు మాట్లాడనున్నారు. కేంద్రం ఇచ్చే క్లారిటీని బట్టి యాసంగిలో వరి సాగు చేయాలా లేక ప్రత్యామ్నాయ పంటలు వేయాలా? అనే దానిపై ఢిల్లీ పర్యటన తర్వాత తెలంగాణ రైతాంగానికి వివరణ ఇస్తామని సీఎం కేసీఆర్ ఇదివరకే చెప్పారు.

ప్రియుడి పురుషాంగాన్ని కోసేసిన యువతి.. ఆ తర్వాత జరిగిన డ్రామా నెవర్ బిఫోర్..


వ్యవసాయ రంగంలో సంస్కరణలంటూ తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలపై ఏడాదిగా రైతులు ఉద్యమించిన నేపథ్యంలో కేంద్రం వాటిని రద్దు చేయడం తెలిసిందే. అయితే సాగు చట్టాల రద్దుతో అంతా ముగిసినట్లు కాదని, తెలంగాణకు శాపంలా ఉన్న విద్యుత్ చట్టాన్ని కూడా కేంద్రం మానుకోవాలని, అన్ని పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) నిర్ధారించే చట్టాన్ని పార్లమెంటులో తీసుకురావాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తోన్న రైతు సంఘాలు కూడా ఇవే డిమాండ్లు చేస్తుండటం తెలిసిందే. ఈనెల 29 నుంచి జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లోనూ ఈ అంశాలను ప్రస్తావిస్తామని కేసీఆర్ ప్రకటించారు కూడా.

acid attack : ఇద్దరు పిల్లల తల్లి ప్రేమ బాగోతం -ఆ పనికి యువకుడు ఒప్పుకోలేదని..


ఈసారి ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం కేసీఆర్.. సింఘు లేదా టిక్రీ బోర్డర్ కు వెళ్లి రైతు ఉద్యమకారులను కలుసుకునే అవకాశాలున్నాయి. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఉద్యమాన్ని సమర్థించిన ఆయన.. గడిచిన ఏడాది కాలంలో అమరులైన 750 మంది రైతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున తలా రూ.3లక్షల పరిహారం ప్రకటించిన సంగతి తెలిసింందే. రైతు నేతలను కలిసే సందర్భంలో సీఎం కేసీఆర్ ఆ చెక్కును అందజేస్తారని తెలుస్తోంది. ఒకవేళ బోర్డర్ కు వెళ్లకుంటే రైతు నేతల బృందమే తెలంగాణ సీఎంను కలుసుకునే అవకాశాలున్నాయి.

భువనేశ్వరికి అవమానం తట్టుకోలేక -చంద్రబాబుకు రజనీకాంత్ ఫోన్ -శపథం నెరవేరుతుంది!


ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ నిర్మాణ పనులను సైతం పర్యవేక్షించనున్నారు. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని విధంగా దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో కంటే బీజేపీతో వైరం పెరిగిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈసారి ఢిల్లీ పర్యటనలో ఫెడరల్ ప్రంట్ అంశాలపైనా దృష్టి సారించబోతున్నట్లు సమాచారం. అయితే ఆయన ఎవరెర్ని కలుస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
Published by:Madhu Kota
First published:

Tags: Bjp, CM KCR, Delhi, Paddy, PADDY PROCUREMENT, Pm modi, Telangana, Trs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు