కొత్త సచివాలయం అలా ఉండాలి.. అధికారులతో సీఎం కేసీఆర్

సచివాలయం బాహ్య రూపం ఎంత హుందాగా, గొప్పగా ఉంటుందో లోపల కూడా అంత సౌకర్యవంతంగా, అన్ని వసతులతో ఉండాలని సీఎం కేసీఆర్ అన్నారు.

news18-telugu
Updated: July 17, 2020, 5:33 PM IST
కొత్త సచివాలయం అలా ఉండాలి.. అధికారులతో సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణ సచివాలయ నూతన భవన సముదాయం రాష్ట్ర కీర్తి ప్రతిష్టలను, సంస్కృతిని ప్రతిబింబించేలా ఉండాలని సీఎం కేసీఆర్ అన్నారు. అదే సందర్భంగా పూర్తి సౌకర్యవంతంగా ఉండాలని సూచించారు. కొత్త సెక్రటేరియట్ నిర్మాణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు. ఆర్ అండ్ బి శాఖ మంత్రి వేముల ప్రశాంతరెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ప్రధాన కార్యదర్శితో పాటు కార్యదర్శులు అంతా అందులోనే తమ విధులు నిర్వర్తించేలా ఉండాలని అన్నారు. గతంలో మాదిరిగా అక్కడొకరు ఇక్కడొకరు విసిరేసినట్లు ఉండొద్దని కేసీఆర్ అన్నారు. సెక్రటేరియట్ సమీపంలోనే అన్ని ప్రభుత్వ శాఖల విభాగాధిపతుల కార్యాలయాల సముదాయాన్ని కూడా నిర్మిస్తామని తెలిపారు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమంతా ఒకే దగ్గర ఉంటుందని సిఎం కేసీఆర్ వెల్లడించారు.

సచివాలయం బాహ్య రూపం ఎంత హుందాగా, గొప్పగా ఉంటుందో లోపల కూడా అంత సౌకర్యవంతంగా, అన్ని వసతులతో ఉండాలని సీఎం కేసీఆర్ తెలిపారు. దీనికి సంబంధించి మంత్రులు, కార్యదర్శుల చాంబర్లు, సమావేశ మందిరాలు, సిబ్బంది కార్యాలయాలు, లంచ్ హాల్స్, సెంట్రలైజ్డ్ స్ట్రాంగ్ రూమ్, రికార్డు రూములు తదితరాలు ఎలా ఉండాలో నిర్ణయించాలని అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్ స్థలంలోనే ప్రార్థనా మందిరాలు, బ్యాంకు, క్రష్, విజిటర్స్ రూమ్, పార్కింగ్, భద్రతా సిబ్బంది నిలయం తదితర ఏర్పాట్లు ఎక్కడ ఎలా ఉండాలో నిర్ణయించాలని అధికారులకు సూచించారు. సౌకర్యాలు, సదుపాయాలు ఎలా ఉండాలనే విషయంలో తుది నిర్ణయం తీసుకుని టెండర్లు పిలవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
Published by: Kishore Akkaladevi
First published: July 17, 2020, 5:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading